Punjab Govt: ప్రముఖ సింగర్,కాంగ్రెస్ నేత సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఈక్రమంలో భగవంత్ మాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో వీవీఐపీల భద్రతపై వెనక్కి తగ్గింది. 400 మందికి పైగా వీవీఐపీల భద్రతను ఈనెల 7 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ ఇటీవల పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పలువురు రాజకీయ ప్రముఖులు, మత పెద్దలను కలిపి మొత్తం 424 మందికి పోలీసు భద్రతను ఉపసంహరించుకుంది. ఇది జరిగిన రెండు రోజులకే సిద్ధూపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరో ఇద్దరికి సైతం గాయాలయ్యాయి. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ఈక్రమంలోనే ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా భగవంత్ మాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Also read:Singer KK: సింగర్ కేకే హోటల్ గదిలో యాంటాసిడ్స్.. లైవ్ షోకి ముందు భార్యకు ఫోన్ చేసి..!
Also read:Bhatti Comments: హిందూత్వం ఎవరి సొత్తు కాదు..బండి సంజయ్‌పై భట్టి విక్రమార్క ఫైర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Punjab Govt: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..వీవీఐపీల భద్రతపై యూటర్న్..!
ఇటీవల సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య
ఈనేపథ్యంలో పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం
వీవీఐపీలకు భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటన