Nalgonda Crime news: నల్గోండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నాంపల్లి మండలం (Nampally Mandal) కేతేపల్లిలో (Kethepally) రామాలయం దగ్గర అపశృతి చోటుచేసుకుంది. స్వామి వారి రథాన్ని తరలించే క్రమంలో విద్యుత్ తీగలు (electric wires) తగలడంతో..అక్కిడక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులను కేతేపల్లి గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మెునయ్య (43)తో పాటు మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి(20)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం కేతేపల్లి గ్రామంలో రాములోరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వేడుకల అనంతరం స్వామివారి ఊరేగింపు రథాన్ని (chariot) ఆలయంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Also Read: Fire in Hotel: హైటెక్ సిటీ హోటల్‌లో మంటలు.. 20 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Nalgonda: నల్గోండ జిల్లాలో విషాదం.. రథం తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి..