Rahu Effect On People: జ్యోతిష్య శాస్త్రంలో రాహువును(Rahu Planet) పాప గ్రహం అంటారు. దీనిని ఎలుసివ్ ప్లానెట్, మిస్టరీ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి యొక్క జాతకంలో రాహువు ఉంటే, అది అతని జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. రాహువు యొక్క దుష్ప్రభావాల కారణంగా, ఒక వ్యక్తి చెడు సాంగత్యానికి గురవుతాడు. డ్రగ్స్ మరియు ఆల్కహాల్ మొదలైన వాటికి బానిస అవుతాడు. జీవితంలో ఆకస్మిక సంఘటనలకు కూడా రాహువు కారణం. రాహువు యొక్క దుష్ప్రభావాలను తొలగించే పరిహారాల (Rahu Remedies) గురించి తెలుసుకుందాం.
రాహువు ఆధిపత్య గ్రహం. ఒక వ్యక్తి యొక్క జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే.. కామన్ మ్యాన్ కూడా కింగ్ అవుతాడు. అదే ఆశుభ స్థానంలో కింగ్ కూడా పేదవాడిగా మిగిలిపోతాడు. అంతేకాకుండా అతను వ్యసనపరుడిగా మారిపోతాడు. అందువల్ల రాహువును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రాహువు జాతకంలో చెడు స్థానంలో ఉన్నప్పుడు, అది వ్యక్తి యొక్క సాంగత్యాన్ని పాడు చేస్తుంది. సమాజంలో చెడ్డవారితో, నేరస్థులతో అతడు స్నేహం చేస్తాడు. తప్పు, ఒప్పుల మధ్య తేడాను గుర్తించలేడు. సకాలంలో చర్యలు తీసుకోకపోతే, జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వ్యక్తి సంపదతో పాటు గౌరవాన్ని కూడా కోల్పోతాడు. రాహువు కారణంగా మనిషి ఆరోగ్యం మరియు వైవాహిక జీవితం కూడా దెబ్బతింటుంది.
రాహు దుష్ప్రభావాల నివారణలు:
**ఒక వ్యక్తి యొక్క జాతకంలో రాహువు అశుభ ఫలితాలను ఇస్తున్నట్లయితే, అతను శివుడిని పూజించాలి.
**శరీరానికి నీటి కొరత రానివ్వవద్దు. దీనిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి.
**ఈ సమయంలో, జంతువులు మరియు పక్షులకు చాలా సేవ చేయండి. వారికి ధాన్యాలు మరియు నీరు ఇవ్వండి.
**రాహువు యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ధూళికి దూరంగా ఉండండి. పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి.
**రాహు మంత్రాన్ని (Rahu Mantra) జపించండి - ఓం భ్రాం బ్రైన్ భ్రూన్ సహ రాహవే నమః.
**ఇంటిలో వండిన ఆహారాన్నే తీసుకోండి. అంతేకాకుండా ప్రతి రోజూ స్నానం చేయండి.
Also Read: Vastu Tips: ఇంట్లో సోఫా ఏ ప్లేస్ లో ఉండాలి? సరైన స్థలంలో ఉంచకపోతే ఏమవుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook