F3 Movie Trailer: మరోసారి ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో వెంకటేష్, వరుణ్ తేజ్!

F3 Movie Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎఫ్ 2'. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీని సీక్వెల్ 'ఎఫ్ 3' మూవీని మే 27న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 10:42 AM IST
F3 Movie Trailer: మరోసారి ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో వెంకటేష్, వరుణ్ తేజ్!

F3 Movie Trailer: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఎఫ్ 3'. గతంలో విడుదలైన '(ఫన్ అండ్ ఫస్ట్రేషన్) ఎఫ్ 2' సినిమాకిది సీక్వెల్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఎఫ్ 2'కు మూడు రెట్లు ఎక్కువ వినోదంతో ఈ సీక్వెల్ 'ఎఫ్ 3' మూవీని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. 

సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచింది. ఈ క్రమంలో ఇటీవలే సినిమా నుంచి 'లబ్ డబ్ లబ్ డబ్' లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పుడీ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. సోమవారం (మే 9) ఉదయం విడుదల చేశారు. 

ముగ్గుల పండుగ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడీ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది. 

'ఎఫ్ 2' సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన తమన్నా.. వరుణ్ తేజ్ కు జోడీగా మెహరీన్ నటించారు. వీరితో పాటు ఈ సినిమాలో సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు.   

Also Read: Happy Birthday Vijay Deverakonda: సమంత, పేరెంట్స్‌తో రౌడీ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్...

Also Read: Geetha Arts: గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా సునీత ధర్నా.. కారణం ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News