Naga Chaitanya OTT debut: అమెజాన్ ప్రైమ్ లో 'ధూత'గా రాబోతున్న నాగచైతన్య!

Naga Chaitanya OTT debut: యంగ్ హీరో నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబోలో రాబోతున్న వెబ్ సిరీస్ కు మేకర్స్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 02:11 PM IST
Naga Chaitanya OTT debut: అమెజాన్ ప్రైమ్ లో 'ధూత'గా రాబోతున్న నాగచైతన్య!

Naga Chaitanya OTT debut: యువ నటుడు నాగ చైతన్య (Naga Chaitanya), దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబోలో ఓ వెబ్ సిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ కానుంది. ఈ సిరీస్ కు 'ధూత' (Dhootha) అనే టైటిల్ ఖరారు చేసిన మేకర్స్... సోషల్ మీడియా వేదికగా నాగఛైతన్య పోస్టర్ విడుదల చేశారు. ధూతలో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ దాస్యం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య రాబోయే చిత్రం 'థాంక్యూ' కూడా విక్రమ్ కుమార్ (Vikram K Kumar) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల ఓటీటీ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రెండేళ్లలో దాదాపు 40 వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందించనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వీటిని నిర్మించనున్నట్టు తెలిపింది. ప్రముఖ నిర్మాణ సంస్థలైన కరణ్ జోహార్ ధర్మ ఎంటర్‌టైన్‌మెంట్, ఎక్సెల్ మీడియా, ఎమ్మీ ఎంటర్‌ప్రైజెస్,  రాజ్ అండ్ డీకే ఫిల్మ్స్‌లతో కలిసి 22 ఒరిజినల్ స్క్రిప్టెడ్ సిరీస్, 9 రిటర్నింగ్ సిరీస్, 3 అమెజాన్ సినిమాలు, 2 కో ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు ప్రకటించింది. 

Also Read: OTT Craze: అమెజాన్ సబ్‌స్క్రైబర్లకు పండగే, 40 వెబ్‌సిరీస్‌లు, సినిమాలు త్వరలో, నాగ చైతన్య వెబ్‌సిరీస్ కూడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News