Portable Ac: వేసవి ఉక్కపోత, ఎండల వేడిమితో జనం అల్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఎసీల డిమాండ్ అధికమైంది. అదే సమయంలో ఇప్పుడు పోర్టబుల్ ఎసీలు కూడా లభిస్తున్నాయి. వాటి ధరెంతో వింటే..ఒక్క క్షణం కూడా ఆగరిక..
వేసవి ఈ ఏడాది తీవ్రంగానే ఉంది. ఏప్రిల్ నెలలోనే ఎండలు దంచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. ఓ వైపు ఎండల వేడిమి, మరోవైపు ఉక్కపోతతో జనం విలవిల్లాడుతూ..ఏసీల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్ధిక స్థోమతను బట్టి ఏసీలు లేదా కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ధర కారణంగా అందరూ ఏసీలు కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో కొన్ని పోర్టబుల్ ఏసీలు అందుబాటులో వచ్చాయి. ఇవి కేవలం ఫ్యాన్ ధరకే లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
అమెజాన్‌లో మినీ ఎయిర్ కండీషనర్లు చాలా అందుబాటులో ఉన్నాయి. ఇవి దాదాపు ఫ్యాన్ ధరలకే లభిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైంది LUCHILA Go Arctic Air Conditioner. ఇది 3 ఇన్ 1 కండీషనర్. దీనినే హ్యుడిడిఫైయర్ ప్యూరిఫైయర్ మిని కూలర్ అని కూడా పిలుస్తారు. దీని అసలు ధర 4 వేల 499 రూపాయలు కాగా, ప్రస్తుతం డిస్కౌంట్‌తో కలిగి కేవలం 1899 రూపాయలకే లభించనుంది. మీరు ఒకవేళ తక్కువ ధరకే ఏసీ కావాలనుకుంటే..ఇదే మీకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం.
ఈ పోర్టబుల్ ఏసీ చాలా లైట్ వెయిట్. అందుకే మీరు ఇంట్లో ఎక్కడైనా సరే సులభంగా తీసుకెళ్లవచ్చు. ఆన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ సౌండ్ లేకుండా డిజైన్ చేశారు. అంటే మీరు ప్రశాంతంగా నిద్రపోగలరు. ఇందులోని హైడ్రో చిల్ టెక్నాలజీ ఎవోపరేటివ్ ఎయిర్ కూలింగ్ ఫిల్టర్ ద్వారా వేడి గాలిని లోపలకు లాక్కుని..వెంటనే చల్లగాలిగా మార్చి బయటకు పంపిస్తుంది.
LUCHILA Go Arctic Air Conditionerలో మల్టీ డైరెక్షనల్ ఎయిర్ వెంట్ ఉంది. దాంతో మీరు ఎక్కడ కావాలంటే అటువైపుకు చల్లగాలిని ఆస్వాదించవచ్చు. చిన్న సైజ్ కావడంతో ఆఫీసు, ఇళ్లు, స్విమ్మింగ్ ఫూల్, కిచెన్ లేదా బెడ్ రూమ్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మరీ ముఖ్యంగా స్టార్ రేటింగ్స్ కలిగి పెద్ద ఏసీల కంటే తక్కువ కరెంటు ఖర్చవుతుంది.
Also read: విద్యుత్ సంక్షోభం రాకుండా ఉండేందుకు 400 క్యారేజీలను నడుపుతున్న రైల్వే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook