Covid 19 Fourth Wave in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ వస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. ఫోర్త్ వేవ్ ఎప్పుడొస్తుందనే విషయంలో అంచనాలే తప్ప ఇప్పటికైతే స్పష్టమైన సమాచారమేదీ లేదు. తాజాగా ఫోర్త్ వేవ్‌కి సంబంధించి నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వే ప్రకారం... దేశంలో 34 శాతం మంది ఏప్రిల్‌లోనే ఫోర్త్ వేవ్ మొదలైందని నమ్ముతున్నారు. అంటే... ఇప్పటికే ఫోర్త్ వేవ్ మొదలై.. ప్రస్తుతం ఆ దశ కొనసాగుతోందని వారు భావిస్తున్నారు.
మరో 13 శాతం మంది రాబోయే మే, జూన్ నెలల్లో.. 7 శాతం మంది జులై, ఆగస్టు నెలల్లో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందని నమ్ముతున్నారు. ఇక 4 శాతం మంది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఫోర్త్ వచ్చే అవకాశం ఉందని నమ్ముతుండగా.. 29 శాతం మంది అసలు 2022లో కరోనా వచ్చే అవకాశం లేదని నమ్ముతున్నారు. మరో 4 శాతం మంది.. కనీసం ఇంకో ఆర్నెళ్ల వరకూ కరోనా రాదని బలంగా నమ్ముతున్నారు.
కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'సోషల్ సర్కిల్స్' ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో భాగంగా దేశంలోని 341 జిల్లాల్లో మొత్తం 36వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. సర్వేలో పాల్గొన్న ప్రతీ ముగ్గురిలో ఒకరు.. దేశంలో ఇప్పటికే ఫోర్త్ వేవ్ మొదలైందని భావిస్తున్నారని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికైతే ఫోర్త్ వేవ్ మొదలు కాలేదని భావిస్తున్నట్లు వెల్లడించారు.
గతేడాది ఫిబ్రవరి, మార్చిలో బీటా, డెల్టా వేరియంట్ కారణంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగి సెకండ్ వేవ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి BA.2.12.1 వేరియంట్‌తో పాటు దాని సబ్ వేరియంట్స్ BA.4, BA.5 కారణంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వేరియంట్స్ కారణంగా ఇప్పటికే దక్షిణాఫ్రికా, యూకెల్లో కేసులు పెరిగాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ కారణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కేసుల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. హెల్త్ కేర్ వ్యవస్థపై మరోసారి దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.