India Corona Cases: ఊహించిందే జరుగుతోంది. దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
కరోనా మహమ్మారి నుంచి విముక్తి ఎప్పటికి లభిస్తుందో తెలియని పరిస్థితి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే జూన్ చివరివారం నాటికి దేశంలో కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభమై..సెప్టెంబర్ వరకూ ఉంటుందని ఇప్పటికే కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు స్పష్టం చేశారు. అదే సమయంలో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఓ దశలో రోజుకు 5 వందలకు పడిపోయిన కేసుల సంఖ్య ఇప్పుడు మళ్లీ 3 వేలకు చేరుతోంది. కాన్పూర్ ఐఐటీ చెప్పింది నిజమేనా..కరోనా ఫోర్త్‌వేవ్ ప్రారంభం కానుందా అనే కలవరం కలుగుతోంది.
గత 24 గంటల్లో దేశంలో 2 వేల 927 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 450 కేసులు అధికం. అదే సమయంలో 32 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దేశంలో ప్రస్తుతం 16 వేల 279 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.58 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 4 కోట్ల 30 లక్షల 65 వేల కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 5 లక్షల 23 వేల 654కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.75 శాతముంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.
కరోనా సంక్రమణ రోజురోజుకీ పెరుగుతుండటంతో కొన్ని రాష్ట్రాలు మరోసారి మాస్క్ ధారణ తప్పనిసరి చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. కరోనా నియంత్రణ, తీసుకోవల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also read: OLA S1 Pro Scooter: బండి మధ్యలో ఆగిపోయినందుకు... చిర్రెత్తుకొచ్చి తగలబెట్టేశాడు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.