Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ టూర్‌లో జనసేన శ్రేణుల జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. అప్పుల ఊబీలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవల అనంతపురం జిల్లాలో కౌలు రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు జనసేన అధినేత పవన్. తాజాగా ఇవాళ ఏలూరు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్‌కు జనసేన శ్రేణులు స్వాగత పలుకుతున్న క్రమంలో పలువురు నోరు జారి జై జగన్ నినాదాలు చేశారు. అయితే తమ అభిమాన నాయకుడిని చూసిన ఆనందం తట్టుకోలేక జై జగన్ నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పరిధిలోని విజయరాయి..పేదవేగి, ధర్మాజీగూడెం, లింగంపాలెం గ్రామాల్లో పర్యటించనున్నట్టు రూట్ మ్యాప్‌లో జనసేన పార్టీ తెలిపింది. పలు గ్రామాల్లో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతులను కుటుంబాలను పవన్ పరామర్శించి ఆర్థిక సాయం చేయనున్నారు. చింతలపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రైతులు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనలో 41 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా రాకతో రోడ్లు జనసంద్రంగా మారాయి.
పశ్చిమ గోదావరి జిల్లా జానంపేటలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న మల్లికార్జునరావు అనే రైతు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందించారు పవన్ కళ్యాణ్. తాను ఎల్లవేళలా అండగా ఉంటానని రైతుల కుటుంబానికి భరోసానిచ్చారు పవన్. ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకపోయిన తమ అధినేత రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొంది అధికారం చేపడతామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని జనసేన శ్రేణులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో బస్సు ఛార్జీలు, నిత్యావసర సరుకులు, కరెంట్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు జనసేన నేతలు. ఏలూరు, భీమవరం జిల్లాలో అప్పుల బాధ తాళలేక 41 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని జనసేన నేతలు తెలిపారు. ప్రతి కౌలు రైతు తమ నాయకుడు కలిసి ఆర్థికసాయం చేసి..బాధిత కుటుంబానికి అండగా ఉంటామని జనసేన అంటున్నారు.
Also Read: KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ వసూళ్ల సునామీ... 9వ రోజు కలెక్షన్లు ఎంతంటే..!
Also Read: AP&TS Forecast: ఏపీ, తెలంగాణ ప్రజలకు వర్షసూచన, కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.