/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

Kieron Pollard Retirement: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆల్ రౌండర్ కిరెన్ పొల్లార్డ్ అన్నీ రకాల పార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తూ అందరికి షాక్ ఇచ్చాడు. 12 మే 1987 లో జన్మించిన పొల్లార్డ్ 2007లో వెస్టిండీస్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 34 ఏళ్ల పొలార్డ్ 15ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు అల్ రౌండర్‌గా అద్భుతమైన సేవలందించాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకే తాను తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో వెస్టిండీస్ జట్టులోకి అడుగుపెట్టిన పొల్లార్డ్ అల్ రౌండర్‌గా రాణించాడు. 

రైట్ హాండ్ బ్యాట్స్‌మెన్, బౌలర్‌గా రాణించిన పొల్లార్డ్ 123 వన్డే మ్యాచులు ఆడి 26.01 యావరేజ్‌తో 2,706 పరుగులు, 101 T20 మ్యాచుల్లో 25.30 యావరేజ్‌తో 1,569 పరుగులు చేశాడు. బౌలింగ్లో రాణించిన పొల్లార్డ్ వన్డేల్లో 39.29 యావరేజ్‌తో  55 వికెట్లు, T20లో 28.28 యావరేజ్‌తో 42 వికెట్లు పడగొట్టాడు. చివరి వన్డే 6 ఫిబ్రవరి 2022 ఇండియాతో ఆడగా లాస్ట్ t20 మ్యాచ్ 20 ఫిబ్రవరి 2022 కావడం విశేషం. 2019 సెప్టెంబర్లో వెస్టిండీస్ వన్డే మరియు t20 జట్టుకు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. వెస్టిండీస్ తరుపున 500 t20 మ్యాచులు ఆడిన మొదటి క్రికెటర్ పొల్లార్డ్. పొట్టి పార్మాట్ క్రికెట్ ఆడటానికి పొలార్డ్ ఎక్కువగా ఇష్టపడతాడు. 2021 శ్రీలంకతో జరిగిన మ్యాచులో అఖిల ధనుంజయ్ వేసిన ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదాడు. హర్షాలే గిబ్స్, యువరాజ్ సింగ్ తరువాత ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అయితే మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే 15 ఏళ్ల కెరీర్లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.

ఐపీఎల్‌లో ప్రస్తుతం ముంబై తరుపున ఆడుతున్న పొల్లార్డ్ అంతగా రాణించలేకపోతున్నాడు. 2010 నుండి ఐపీఎల్‌లో ముంబై తరుపున ఆడుతున్న పొల్లార్డ్ ఇప్పటివరకు 184 మ్యాచులు ఆడి.. 3350 రన్స్ చేయగా అందులో 16 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో పొల్లార్డ్ చేసిన అత్యధిక స్కోర్ 87 నాటౌట్. బౌలింగ్లో ఇప్పటివరకు 66 వికెట్లు తీసాడు.

వీడ్కోలు సందర్భంగా భావోద్వేగానికి లోనైన పొల్లార్డ్ జట్టుతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. లారా కెప్టెన్సీలో వెస్టిండీస్ టీంలోకి రావడాన్ని ఎప్పటికి మర్చిపోలేనని గుర్తుచేసుకున్నాడు. తాను ఆడిన ఏ మ్యాచులోనైనా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో 100 శాతం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికే ప్రయత్నించానని పొల్లార్డ్ తెలిపాడు. అయితే అనూహ్యంగా పొల్లార్డ్ రిటైర్మెంట్ ప్రకటన అందరిని షాక్‌కు గురిచేసింది. ఈ ఏడాది జరిగే T20 వరల్డ్ కప్ వరకు పొల్లార్డ్ కొనసాగుతాడాని అంతా భావించారు కానీ రిటైర్మెంట్ ప్రకటిస్తూ పొల్లార్డ్ (Kieron Pollard) నిర్ణయం తీసుకోవడం వెస్టిండీస్ టీమ్‌ను షాక్‌కు గురి చేసింది. పొల్లార్డ్ రిటైర్మెంట్‌పై క్రికెట్ అభిమానులు పోస్టుల ద్వారా తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. విధ్వంసకరమైన పొల్లార్డ్ బ్యాటింగ్ మిస్ అవుతున్నామని నెటిజెన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

Also read : David Warner: డేవిడ్ వార్నర్ ఔట్.. గుక్కపట్టి ఏడ్చిన దేవ్ భాయ్ కూతురు (వీడియో)

Also read : DC vs PBKS: దంచికొట్టిన షా, వార్నర్.. పంజాబ్‌పై ఢిల్లీ సునాయాస విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
kieron pollard retirement news, west indies all rounder kieron pollard retires
News Source: 
Home Title: 

Kieron Pollard Retirement: కిరెన్ పొల్లార్డ్ రిటైర్మెంట్ న్యూస్.. షాక్‌లో పొల్లార్డ్ ఫ్యాన్స్

Kieron Pollard Retirement: కిరెన్ పొల్లార్డ్ రిటైర్మెంట్ న్యూస్.. షాక్‌లో పొల్లార్డ్ ఫ్యాన్స్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

క్రికెట్‌కి గుడ్ బై చెప్పి షాకిచ్చిన కిరెన్ పొల్లార్డ్

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో వెస్టిండీస్ జట్టులోకి అడుగుపెట్టిన పొల్లార్డ్

వీడ్కోలు సందర్భంగా భావోద్వేగానికి లోనైన పొల్లార్డ్

Mobile Title: 
Kieron Pollard Retirement: కిరెన్ పొల్లార్డ్ రిటైర్మెంట్ న్యూస్.. షాక్‌లో ఫ్యాన్స్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, April 21, 2022 - 00:03
Created By: 
Pavan Reddy Naini
Updated By: 
Pavan Reddy Naini
Published By: 
Pavan Reddy Naini
Request Count: 
47
Is Breaking News: 
No