Shani Effect: విశ్వంలో ప్రతి గ్రహాలు, వాటి కదలికలకు జ్యోతిష్యశాస్త్త్రంతో సంబంధముంది., ప్రతి గ్రహపు రాశి కదలిక ప్రభావం చుపించినా..శని ప్రభావం కాస్త ఎక్కువే.రెండున్నర లక్షల ఏళ్ల తరువాత వస్తున్న ఏప్రిల్ 29 న శని రాశి మారనుంది.
శని గ్రహం పేరు వినగానే సాధారణంగా అందరి మనసుల్లో భయం , వణుకు మొదలవుతుంటాయి. శని చెడు దృష్టి జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే శని కారణంగా అశుభాలతో పాటు మహర్ధశ కూడా ఉంటుంది. కర్మ ఫలాలు ప్రసాదించే శని వచ్చే ఏప్రిల్ 29 నుంచి రాశి మారనుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అరిష్టం తొలగిపోతుంది. కొంతమందికి ప్రారంభం కానుంది. ఇలా ఈసారి శని మహర్దశను, అరిష్టాన్ని రెండింటినీ మొసుకొస్తోంది.
శని వల్ల ఈ రాశులవారికి ప్రయోజనం
శని తన రాశి కుంభంలో సంచరిస్తుంది. ఇది 3 రాశులవారికి అత్యంత ప్రయోజనకరం. శని రాశి మారుతూనే..ఈ రాశులవారి జీవితం ఫలవంతమవుతుంది.
మేషరాశి జాతకులకు శని గోచారం మంచి రోజుల్ని తీసుకొస్తుంది. శని రాకవల్ల వారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్థులకైతే వ్యాపారం వృద్ధి చెందుతుంది. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్థులకు ప్రమోషన్ లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ప్రయాణాలు చేయవచ్చు. రోగాల్నించి విముక్తి పొందుతారు.
కుంభరాశి జాతకులకు శని గోచారం చాలా విషయాల్లో ఉపశమనం కల్గిస్తుంది. ఈ రాశుసమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒకదాని తరువాత ఒకటిగా అభివృద్ధి కన్పిస్తుంది. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ప్రమోషన్ పొందుతారు. గౌరవం లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు మంచి సమయం ఇది. మొత్తానికి ఈ రాశివారికి ఉపయోగకరం.
థనస్సు రాశి జాతకులకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. ధైర్యం, సాహసం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. పాత రోగాల్నించి విమక్తి లభిస్తుంది. శనికి సంబంధించి ఇనుము, ఆయిల్, మద్యం వంటి వ్యాపారాల్లో మంచి లాభాలు ఆర్జిస్తారు.
Also read: Benefits Of Copper Vessel Water: రాగి పాత్రలో ఉంచిన నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook