Ukrainian Girls Cutting their hair Short to escape Russian Soldiers: రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్‌లో పెరుగుతున్న అత్యాచారాల నుంచి తప్పించుకునేందుకు అక్కడి మహిళలు, చిన్నారులు అందహీనంగా ఉండటానికి తమ జుట్టును కత్తిరించుకుంటున్నారని ఓ వార్తా సంస్థ తమ కథనంలో పేర్కొంది. ఈ పరిస్థితుల గురించి ఇవాన్‌కివ్ ప్రాంత డిప్యూటీ మేయర్ మేరీనా బెస్చాస్ట్నా వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
పుతిన్ సైన్యం ఆధీనంలో 35 రోజుల పాటు ఉన్న తమ ప్రజలు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని ఇవాన్‌కివ్ డిప్యూటీ మేయర్ మేరీనా బెస్చాస్ట్నా తెలిపారు. 'ఉక్రెయిన్‌లోని ఓ ఊరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురయ్యారు. వారికి సుమారు 15 నుంచి 16 ఏళ్లు ఉంటాయి. వారిని రష్యా సైనికులు బేస్‌మెంట్ నుంచి జుట్టుతో బయటకు లాక్కెళ్లారు. అందుకే ఉక్రెయిన్‌లోని అమ్మాయిలు తమ అందాన్ని తగ్గించుకునేందుకు (అందహీనంగా మారడం కోసం) జుట్టు కత్తిరించుకుంటున్నారు' అని సదరు మేయర్ వెల్లడించారు.
ఈ ఘటన కీవ్ సమీపంలోని ఇవాన్‌కివ్ ప్రాంతాన్ని రష్యా సేనలు ఆక్రమించినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఉక్రెయిన్ సైనికులు కొత్తగా పాంటూన్ బ్రిడ్జ్‌ను నిర్మించడంతో ఈ ప్రాంతం మళ్లీ ఉక్రెయిన్‌తో అనుసంధానమైంది. అలాగే రష్యా సైనికుల నుంచి బయటపడిన మిగతా వారు కూడా తాము పడిన భయాందోళన పరిస్థితుల గురించి వెల్లడించారు. తమ ముందే పిల్లలను మందు గుండ్లతో పేల్చడంతో తీవ్రంగా గాయపడ్డారని పలువురు కుంటుంబ సభ్యులు చెప్పారు.
రష్యా సేనలు చేస్తున్న దాడుల్లో తమ పిల్లలకు కాళ్లకు, వెన్నెముకకు గాయాలయ్యాయని అక్కడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గాయాలతో వారు జీవితాంతం పోరాడుతునే ఉండాలని గాయపడిన చిన్నారుల కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనలపై ఐక్య రాజ్య సమితి వెంటనే స్పందించాలంటూ జెలెన్‌స్కీ డిమాండ్ పలు సార్లు చేశారు. ఇటివలే జరిగిన బుచా హింసాకాండ నేపథ్యంలో జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలపై రష్యా స్పందిస్తూ.. ఇదంతా ఉక్రెయిన్ రెచ్చగొట్టే చర్యే అంటూ కొట్టిపారేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24 నుంచి దాడులు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
Also Read: Shikhar Dhawan: రోహిత్, కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు.. తొలి భారత బ్యాటర్‌గా ధావన్ అరుదైన రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook