IPL 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్... స్టేడియంలలో 50 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్

BCCI allows 50 percent Occupancy: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఇకనుంచి క్రికెట్ స్టేడియంలలో 50 శాతం ఆక్యుపెన్సీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 07:54 PM IST
  • క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్
  • ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌లలో ప్రేక్షకుల ఆక్యుపెన్సీ 50 శాతం
  • తాజాగా నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
IPL 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్... స్టేడియంలలో 50 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్

BCCI allows 50 percent Occupancy: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఇకనుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే క్రికెట్ స్టేడియంలలో 50 శాతం ఆక్యుపెన్సీని అనుమతించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా 25 శాతానికి కుదించిన ప్రేక్షకుల ఆక్యుపెన్సీని తాజాగా 50 శాతానికి పొడగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌లో ఈ నెల 6న జరిగే కేకేఆర్-ముంబై మ్యాచ్‌‌తో ఈ నిర్ణయం అమలులోకి రానుంది. బీసీసీఐతో అధికారిక టికెట్ పార్ట్‌నర్‌గా ఉన్న 'బుక్ మై షో' సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోని ముంబై, పుణే స్టేడియంలలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం పుణేలోని బ్రబౌర్న్ స్టేడియం, ఎంసీఏ స్టేడియంలలో ఈ మ్యాచ్‌లు జరుగతున్నాయి. రేపటి (ఏప్రిల్ 2) నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తుండటంతో.. క్రికెట్ స్టేడియంలలో మరింత మంది ప్రేక్షకులు లైవ్ మ్యాచ్‌ వీక్షించేందుకు అవకాశం కల్పించేలా బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు. 

ఇక ఐపీఎల్‌ విషయానికొస్తే.. ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పంజాబ్‌కి బ్యాటింగ్ అప్పగించింది. ఇప్పటివరకూ పంజాబ్ ఒక మ్యాచ్‌ మాత్రమే అందులో విజయం సాధించింది. కేకేఆర్ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో విజయం సాధించగా.. మరో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. పంజాబ్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టుపై 206 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ఔరా అనిపించింది. ఇక కోల్‌కతా తొలి మ్యాచ్‌లో చెన్నై గెలుపొంది.. తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీపై ఓటమిపాలైంది. 

Also Read: KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. షెల్డన్ ఔట్! రబాడ వచ్చేశాడు!

Also Read: Ugadi 2022: ఉగాది పండుగ పూట పాటించాల్సిన నియమాలు... చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News