Summer Heat in Telangana: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి కాలు బయటపెట్టేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలోని 6 జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది.
రానున్న 3 రోజుల్లో ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకి వెళ్లాలని హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు, రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ఇవాళ విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది. సముద్ర మట్టం నుంచి సుమారు 0.9కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. తద్వారా రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.
కాగా, గురువారం (మార్చి 31) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు దాటాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 43.8 డిగ్రీలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 43.7, భూపాలపల్లి కాటారంలో 43.6, నిజామాబాద్ జిల్లా లక్మాపూర్‌లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతతో పగటిపూట జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏవైనా పనులు ఉంటే సాయంత్రం వేళల్లోనే ఇళ్ల నుంచి బయటకు వెళ్తున్నారు తప్ప ఎండలో తిరిగేందుకు భయపడిపోతున్నారు.
Also Read: IPL 2022 Spectators: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే!
Also Read: Rana Daggubati: మీరు తల్లి కాబోతున్నారా?.. 'భీమ్లా నాయక్' హీరో సతీమణి ఏం చెప్పారంటే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook