Paddy Procurement Issue: బండి సంజయ్ మగాడైతే... సవాల్ విసిరిన మంత్రి ప్రశాంత్ రెడ్డి...

ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ములాఖత్ అయి రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.తెలంగాణ‌కు అన్యాయం చేసే పార్టీలు కనుమరుగు కాక తప్పదన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 03:33 PM IST
  • వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో టీఆర్ఎస్ ఫైట్
  • బండి సంజయ్‌కి సవాల్ విసిరిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
  • బండి మగాడైతే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని డిమాండ్
Paddy Procurement Issue: బండి సంజయ్ మగాడైతే... సవాల్ విసిరిన మంత్రి ప్రశాంత్ రెడ్డి...

Paddy Procurement Issue: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణలో పండిన ప్రతీ గింజను కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా.. అసలు ఎంత ముడి బియ్యం ఇస్తారనే దానిపై ఇప్పటివరకూ టీఆర్ఎస్ సర్కార్ నుంచి క్లారిటీ రాలేదని కేంద్రం చెబుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అంశాన్ని రాజకీయం చేస్తోందని కేంద్రం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తాజాగా ఈ వ్యవహారంపై స్పందించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ మగాడైతే.. ఆయనకు ఒంట్లో నెత్తురు ఉంటే... కేంద్రంతో ధాన్యం కొనిపించాల‌ని ప్ర‌శాంత్ రెడ్డి స‌వాల్ చేశారు. ధాన్యం సేకరణకు తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో కొనిపిస్తాన‌ని చెప్పిన బండి సంజయ్.. తీరా ఇప్పుడు రాష్ట్రం స‌హ‌క‌రించ‌ట్లేద‌ని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. సంజయ్ ఏం మాట్లాడుతున్నారో ఎవ‌రికీ అర్ధం కావ‌ట్లేదన్నారు. బండి సంజ‌య్ అస‌లు మ‌నిషేనా.. బీజేపీ అధ్య‌క్షుడేనా.. అని ప్ర‌శ్నించారు.

పంజాబ్‌‌లో ఎలాగైతే వరి ధాన్యం, గోధుమలను కేంద్రం సేకరిస్తుందో.. తెలంగాణ నుంచి కూడా వానాకాలం, యాసంగి ధాన్యాన్ని సేకరించాలని కేంద్రాన్ని కోరామన్నారు శాంత్ రెడ్డి. కానీ కేంద్రమంత్రి పీయూష్ గోయ‌ల్ స్పందించిన తీరు బాధించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా ఆయన మాట్లాడటం గుండెల నిండా బాధను నింపిందన్నారు.

నూకల బియ్యాన్ని పీడీఎస్ కింద తెలంగాణ ప్రజలకు పంపిణీ చేయాలని.. కేంద్రం నుంచి పీడీఎస్ కింద ఇచ్చే బియ్యాన్ని ఆపేస్తామని పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం సరికాద‌న్నారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడినందుకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌న‌ని అసెంబ్లీలో చెప్పిన కిర‌ణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు దిక్కు లేకుండా పోయాడరని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ములాఖత్ అయి రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.తెలంగాణ‌కు అన్యాయం చేసే పార్టీలు కనుమరుగు కాక తప్పదన్నారు.

Also Read: Video: గుండెలు పిండేసే వీడియో.. కూతురి శవాన్ని భుజాలపై 10కి.మీ మోసుకెళ్లిన తండ్రి

Also read: RRR OTT Streaming: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో ఎప్పుడు, ఎందులో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News