Bus ticket Fare hiked in Telangana: తెలంగాణలతో నష్టాల కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీని అప్పుల ఊబిలో నుంచి ఒడ్డుకు చేర్చేందుకు బస్సు ఛార్జీలు పెంచుతారని గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఛార్జీల పెంపు తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే తెలంగాణ ఆర్టీసీ అదనపు వడ్డింపులు చేపట్టింది.
పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యతో రౌండ్ ఫిగర్ చేశారు ఆర్టీసీ అధికారులు. సూపర్ లగ్జరీ బస్సుల్లో స్వల్పంగా టికెట్ ఛార్జీలు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో చడీచప్పుడు లేకుండా సేఫ్టీ సెస్ పేరుతో 5 రూపాయలు పెంచి ప్రయాణీకులపై మరింత భారాన్ని మోపింది. పెంచిన ఛార్జీల టికెట్ రెట్లతో తెలంగాణ ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరగడంతో బస్సు ఛార్జీలు పెంచకతప్పలేదని టీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 5 నెలలుగా ఆ ఫైలు కదలిక లేక మూలన పడింది. అయితే బస్సుల్లో ప్రయాణీకుల నుంచి చిల్లర సమస్యను అధిగమించేందకు టీఎస్ ఆర్టీసీ అధికారులు ఛార్జీలను రౌండ్ ఫిగర్ చేశారు. 11 రూపాయలుగా ఉన్న టికెట్ ధరను 10కి.. 13-14 రూపాయలుగా ఉన్న ఛార్జీలను 15కి అధికారులు రౌండాఫ్ చేశారు.
నేషనల్ హై వే సంస్థ టోల్ ఛార్జీలను పెంచడంతో.. ఆ సాకు చూపి రక్షణ ఛార్జీల పేరుతో ఒక రూపాయిని పెంచారు. ఈ రెండింటి ద్వారా టీఎస్ ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీకి సగటున రోజుకు 12 కోట్లు ఆదాయం వస్తున్న నేపథ్యంలో.. తాజాగా పెంచిన టికెట్ ధరలతో 13 కోట్లు దాటుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.
బస్సు ఛార్జీల పెంపుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇస్తే ఏటా వెయ్యి కోట్లకుపైగా అదనంగా ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. టికెట్ ఛార్జీలు పెంచితే సంస్థకు ఆదాయం పెరిగి సరైన గాడిలో పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: KGF Chapter 2: మీరు అతనికి అడ్డు నిలబడకండి సార్.. 'తూఫాన్' వచ్చేసింది!!
Also Read: Pegasus in Ap Assembly: అసెంబ్లీలో పెగసస్ అంశంపై చర్చ, టీడీపీని ఇరుకునపెట్టే వ్యూహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook