Pallavi Raju: ఏపీ డిప్యూటీ సీఎంకు బిగ్ షాక్... టీడీపీలో చేరుతున్న ఆడపడుచు...

Pallavi Raju decided to Join TDP:  పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, మన్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే పార్టీ మార్పుకు కారణమని తెలిపారు. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా దొరకకపోవడం బాధించిందన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 04:27 PM IST
  • టీడీపీలో చేరుతున్న డిప్యూటీ సీఎం ఆడపడుచు
  • త్వరలో టీడీపీలోకి పల్లవి రాజు, శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు
  • టీడీపీ నుంచి టికెట్ హామీ దక్కినట్లు ప్రచారం
Pallavi Raju: ఏపీ డిప్యూటీ సీఎంకు బిగ్ షాక్... టీడీపీలో చేరుతున్న ఆడపడుచు...

Pallavi Raju decided to Join TDP: ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఇంట్లో రాజకీయ పోరు చర్చనీయాంశంగా మారింది. పుష్ప శ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, ఆయన కుమార్తె పల్లవి రాజు  టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, మన్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే పార్టీ మార్పుకు కారణమని తెలిపారు. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా దొరకకపోవడం బాధించిందన్నారు. గౌరవం లేని పార్టీలో ఇక కొనసాగలేమని... అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నామని శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

పల్లవి రాజు మాట్లాడుతూ.. లాబేసు-పూర్ణపాడు వంతెన, నాగావళి వంతెన కురుపాం గిరిజనుల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ వంతెనలు నిర్మాణం కాలేదని.. వర్షాకాలంలో కురుపాం నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో పాము కాటుకు గురై విద్యార్థి మరణిస్తే కనీసం ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం బిల్లు ఇప్పటికీ పార్లమెంట్‌లో పాస్ అవలేదన్నారు. ఇలా చాలా అంశాల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

పుష్ప శ్రీవాణి భర్త, వైసీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పరీక్షిత్ రాజుకు పల్లవి రాజు సొంత చెల్లెలు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు పరీక్షిత్ రాజును కాకుండా తన కుమార్తె పల్లవి రాజును తన రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. టీడీపీలో చేరిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ఉన్న శత్రుచర్ల... 2018లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో తిరిగి వైసీపీ గూటికి చేరారు. అయితే పార్టీలో తగిన గుర్తింపు దక్కట్లేదన్న కారణంతో కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా ప్రకటించారు. తాజాగా ఆయన కుమార్తె కూడా రాజీనామా ప్రకటించడంతో డిప్యూటీ సీఎం ఇంట్లో ఇంటి పోరు మొదలైందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పల్లవి రాజు సొంత వదిన పాముల పుష్ప శ్రీవాణిపై పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు టికెట్‌పై ఇప్పటికే టీడీపీ నుంచి హామీ దక్కిందనే ప్రచారం జరుగుతోంది. 

Also Read: IND vs ENG: వరల్డ్ కప్ లో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ.. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో ఓటమి!

Also Read: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News