CM Jagan: మహిళలకు 51శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం AP: సీఎం జగన్‌

CM Jagan: రాష్ట్రంలోని ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. రెండున్నరేళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించామని జగన్ అన్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 04:17 PM IST
CM Jagan: మహిళలకు 51శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం AP: సీఎం జగన్‌

International Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవ (International Women's Day)వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ (CM Jagan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఏకంగా 51 శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం జగన్ అన్నారు. రెండున్నరేళ్లుగా అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం వినియోగించామని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రాజకీయ సాధికారిత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

మహిళలకు 51 శాతం పదవులు కేటాయించాలని చట్టం చేసిన తొలి ప్రభుత్వం తమదేనని జగన్ అన్నారు. జడ్పీ ఛైర్‌ పర్సన్‌లుగా 54శాతం మంది, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లుగా 64 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపారు. నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు కూడా మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా జగన్ తెలిపారు. వైఎస్సార్‌ ఆసరా వడ్డీ పథకం దేశంలో ఎక్కడా లేదని సీఎం గుర్తు చేశారు. వాలంటీర్లుగా 53 శాతం మహిళలే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు అమ్మఒడి పథకం ద్వారా రూ.13వేల కోట్లు ఇచ్చామని జగన్ అన్నారు. 

Also Read: World Womens Day: విజయవాడలో అత్యంత ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవం, 15 వేలమంది మహిళా ప్రజా ప్రతినిధులతో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News