Indians in Ukraine: యురోపియన్ దేశమైన పోలాండ్ ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులకోసం గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉక్రెయిన్ గగనతలం మూసేసిన కారంగా సమీప దేశాలకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి.. అక్కడి నుంచి ఇండియాకు విమానాల్లో చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌తో భూ మార్గమున్న పోలండ్ దేశం.. భారతీయులు వీసా లేకుండానే తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని.. ఇండియాలోని పోలండ్ అంబాసిడర్ అడమ్ బురాకోవిస్కీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేశారు.
సంక్షోభం నేపథ్యంలో పోలండ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ఉక్రెయిన్లో చిక్కుకున్న వందలాది మంది భారతీయులకు ఎంతో ఊరటనిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
Poland is allowing to enter without any visa all Indian students who escape from Russian aggression in Ukraine.
— Adam Burakowski (@Adam_Burakowski) February 27, 2022
కొనసాగుతున్న ఆపరేషన్ గంగా..
భారత ప్రభుత్వం ఇప్పటికే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఆపరేషన్ గంగాను చేపట్టింది. రొమానియా సహా ఉక్రెయిన్‌కు సమీపంలోని ఇతర దేశాల ద్వారా ప్రత్యేక విమానాల్లో పౌరులను భారత్‌కు తీసుకొస్తోంది. ఇందుకు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తున్నట్లు సమాచారం.
ఆపరేషన్ గంగాలో భాగంగా.. నిన్న 219 మందితో తొలి విమానం బయల్దేరింది. 198 మందితో కూడిన నాలుగో విమానం కొద్ది సేపటి క్రితం బయల్దేరింది. ఈ ఆపరేషన్ కోసం ఎయిర్ ఇండియా విమానాలను వినియోగిస్తోంది ప్రభుత్వం.
చర్చలకు రెడీ..
మరోవైపు రష్యా- ఉక్రెయిన్లో చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి సిద్ధమయ్యాయి. బెలారుస్ వేదికగా ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి.
Also read: Russia Ukraine War: బెలారస్ వేదికగా చర్చలకు సిద్ధమైన రష్యా, ఉక్రెయిన్... యుద్ధానికి తెరపడేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Indians in Ukraine: భారతీయులకోసం పోలండ్ కీలక నిర్ణయం- వీసా లేకున్నా ఎంట్రీ!
ఇండియన్స్‌కు పోలండ్ ఊరట
ఉక్రెయిన్లో చిక్కున్న వారికి వీసా లేకున్నా అనుమతి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నిర్ణయం