Rocking Rakesh-Jordar Sujatha: జబర్దస్త్ కమెడియన్ తో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమాయాణం..త్వరలోనే పెళ్లి!

Rocking Rakesh-Jordar Sujatha: జబర్దస్త్ కమెడియన్ రాకేష్, యాంకర్ సుజాతల పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో నిజానిజాలేంటో తెలుసుకుందాం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 10:24 AM IST
Rocking Rakesh-Jordar Sujatha: జబర్దస్త్ కమెడియన్ తో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమాయాణం..త్వరలోనే పెళ్లి!

Rocking Rakesh-Jordar Sujatha: రాకింగ్ రాకేష్ (Rocking Rakesh).. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనాధన్ ధనరాజ్ టీంలో మెంబర్ గా చేరి..ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు. చిన్న పిల్లలతో స్కిట్ చేయించడంలో రాకేష్ దిట్ట. తాజాగా ఈ నటుడు ప్రేమలో పడ్డట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. 

కొన్ని జోడీలు కేవలం షో కోసం లవ్‌ ట్రాక్‌ నడుపుతాయి. మరికొన్ని నిజంగానే ప్రేమలో పడతాయి. అలాంటి జోడీనే రాకింగ్‌ రాకేష్‌-జోర్దార్‌ సుజాతలు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ (Love) ట్రాక్ నడుస్తోందంటూ నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఈ జంట తమది రియల్‌ జోడీనే అని ప్రకటించారు. ఇక రాకేశ్‌ అయితే రింగ్‌ పెట్టి మరీ ప్రపోజ్‌ చేశాడు.  

యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సుజాత (Jordar Sujatha) బిగ్‌బాస్‌ సీజన్‌-4లో (Bigg Boss Season 4) పాల్గొన్నడం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.  ప్రస్తుతం పలు టీవీ షోల్లో చేస్తోంది సుజాత. ఈ క్రమంలోనే రాకింగ్‌ రాకేష్‌తో కలిసి జబర్ధస్త్ (Jabardasth)లో పలు స్కిట్‌లు చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారని...వీరి పెళ్లికి  ఇరుకుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది.  ఈ ఏడాదే వీరి పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Bheemla Nayak Day 1 Collections: బాక్సాఫీస్ పై 'భీమ్లా నాయక్' దండయాత్ర... ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News