Mallanna Sagar Project: కాళేశ్వరం (kaleshwaram) ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్( Mallanna Sagar) ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్నకు సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిజర్వాయర్‌లోకి సీఎం కేసీఆర్ (CM KCR) నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విహంగవీక్షణం ద్వారా కేసీఆర్ ప్రాజెక్టును పరిశీలించారు.
Live: CM Sri KCR inaugurating #MallannaSagar Reservoir. https://t.co/0IWfun8ZXo
— Telangana CMO (@TelanganaCMO) February 23, 2022
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని రిజర్వాయర్స్ కంటే మల్లన్నసాగర్ అత్యంత ఎత్తులో ఉన్న జలాశయంగా గుర్తింపు పొందింది. దీనిని 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ జలాశయానికి 5 ఓటీ స్లూయిస్ లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 11 కంపెనీలు పాలుపంచుకున్నాయి. సుమారు 7వేల మంది కార్మికులు ప్రతి నిత్యం మూడు షిఫ్టుల్లో పని చేశారు.
కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు మల్లన్నసాగర్ ద్వారానే నీటిని తరలిస్తారు. నిజాంసాగర్, సింగూరు, ఘనపూర్ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ రిజర్వాయర్ పైనే ఆధారపడి ఉంది. ఈ జలాశయం ద్వారా 15 లక్షల 71 వేల 50 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. హైదరాబాద్ ప్రజల తాగునీటి కోసం 30 టీఎంసీల నీటిని భవిష్యత్తులో సరఫరా చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు నుంచే నీటిని వినియోగించనున్నారు.
Also Read: CM KCR: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Mallanna Sagar: మల్లన్న సాగర్ జలాశయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభం
జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్