Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఉక్రెయిన్ లో నివసిస్తున్న విదేశీయులను తమతమ దేశాలు తిరిగి రమ్మంటున్నాయి. ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 242 మందిని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం రాత్రి చేర్చారు. ఇదే విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్ వెల్లడించారు.
#WATCH | Air India special flight carrying around 242 passengers from Ukraine reaches Delhi pic.twitter.com/ctuW0sA7UY
— ANI (@ANI) February 22, 2022
ఉక్రెయిన్ లో ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 242 మంది ఢిల్లీకి చేర్చినట్లు విదేశాంగ సహాయమంత్రి మురళీధరన్ తెలిపారు. అందులో కొందరు ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. సదరు దేశం నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకువచ్చేందుకు మరిన్ని విమానాలను అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
#WATCH | "The situation is normal there but we decided that she would come back to be on the safe side amid escalating tensions between Russia and Ukraine," a resident of Haryana, whose daughter was returning from Ukraine said pic.twitter.com/7kPcn7vOtA
— ANI (@ANI) February 23, 2022
మంగళవారం రాత్రి ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న భారతీయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణం నుంచి బయటపడి స్వదేశానికి చేరుకోవడం తమకు ఎంతో ఉపశమనంగా ఉందని వారు పేర్కొన్నారు. వందే భారత్ మిషన్ లో భాగంగా ఉక్రెయిన్, భారత్ మధ్య ఎయిర్ ఇండియా ఈ విమాన సర్వీసులను నడుపుతోంది. ఈ నెల 24, 26 తేదీల్లో ప్రత్యేక విమానాలు ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి చేర్చనున్నాయి.
Also Read: Russia-Ukraine conflict: 'భారతీయ విద్యార్థులారా...వెంటనే ఉక్రెయిన్ వీడండి'..: ఇండియన్ ఎంబసీ
Also Read: Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌లోని భారతీయులకు అలర్ట్.. ఆ దేశాన్ని వీడాలన్న భారత్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook