Medaram Jatara 2022 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం (Medaram Jatara). ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకోసారి జరుగుతోంది. ఈనేపథ్యంలో.. మేడారం జాతరకు నిధుల విడుదలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ జాతరకు రూ. 2.5 కోట్లు నిధులను విడుదల చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మేడారం జాతరకు కేంద్రం ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. దేశ జనాభాలో సుమారు 10శాతం ఉన్న గిరిజన జాతుల వారసత్వం, సంస్కృతి పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే పండుగలకు 2014 నుంచి రూ.2.45 కోట్లు మంజూరు చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. స్వదేశ్ దర్శన్ స్కీమ్, గిరిజన సర్క్యూట్‌ల అభివృద్ధిలో భాగంగా.. 2016-17లోనే దాదాపు 80 కోట్ల రూపాయలతో ములుగు - లక్నవరం - మేడవరం - తాడ్వాయి - దామరవి - మల్లూర్ - బోగత జలపాతాలలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సమగ్ర అభివృద్ధిని చేపట్టినట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే..మేడారంలో గెస్ట్ హౌస్, ఓపెన్ ఆడిటోరియం, పర్యాటకుల కోసం విడిది గృహాలు, తాగునీటి సౌకర్యం వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
సాధారణంగా మేడారం జాతరను (Medaram Jatara 2022) రెండేళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజుల్లో జరుపుతారు. ఈ ఏడాది జాతరను ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ సంవత్సరం కేసీఆర్ సర్కార్ రూ.75కోట్లు రిలీజ్ చేసింది.
Also Read: Medaram Jatara: మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లొద్దామా..! పూర్తి వివరాలివిగో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook