Corona Serious Phase May End this year says WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి కరోనా తీవ్రమైన దశ ముగుస్తుందని అంచనా వేసింది. అయితే ఈ ఏడాది మధ్య నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి టీకా ఇవ్వగలిగితే ఇది సాధ్యమవుతుందని పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ.
వార్తా సంస్థ ఏఎఫ్‌పీ ప్రకారం.. ఈ ఏడాది జూన్, జులై నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి కరోనా టీకా ఇవ్వగలిగితే.. కరోనా అంతమవుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియాసిస్ చెప్పినట్లు తెలిసింది.
ఆఫ్రిజెన్ బయోలాజిక్స్ అండ్ వ్యాక్సిన్స్ సందర్శన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు అధనోమ్. ఆఫ్రిజెన్ బయోలాజిక్స్ అండ్ వ్యాక్సిన్స్ కరోనా వైరస్‌కు సంబంధించి తొలి ఎంఆర్ఎన్ఏ టీకాను ఉత్పత్తి చేయనున్న సంస్థ. మెడార్నా సీక్వెన్సింగ్‌ను ఉపయోగించి దీనిని ఉత్పత్తి చేయడం గమనార్హం.
ఇక ఈ వ్యాక్సిన్‌పై స్పందించిన అధనోమ్.. ఈ వ్యాక్సిన్‌ను తక్కువ మోతాదులో, తక్కువ ధరలో ఇచ్చేందుకు అనుకూలమైనదిగా భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ వ్యాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. 2024 నుంచి పూర్తి స్థాయిలో ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ఇలా..
ఆఫ్రికాలో ఇప్పటి వరకు 11 శాతం మంది మాత్రమే పూర్తి స్థాయిలో టీకాలు వేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యల్పం. దీనితో ఈ ఏడాది మధ్య నాటికి 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలంటే.. టీకా ప్రక్రియ వేగం 6 రెట్లు పెరగాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా పేర్కొంది.
ఒమిక్రాన్ కరోనా చివరి వేరియంట్ కాదని స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్ఓ. భవిష్యత్‌లో మరిన్ని వేరియంట్స్ రావచ్చని.. అవి మరింత తీవ్రమైనవి కూడా కావచ్చని తెలిపింది.
మరోవైపు కొవిడ్ వల్ల పేదరిక సమస్య మరింత తీవ్రమవుతున్నట్లు వరల్డ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 4 కోట్ల మందిని కొవిడ్ మహమ్మారి ఇప్పటికే పేదరికంలోకి నెట్టినట్లు అంచనా వేసింది.
Also read: Norway Night Time: ఆ దేశంలో రాత్రి సమయం ఎంత సేపుంటుందో తెలుసా..
Also read: Mount Everest: వేగంగా కరిగిపోతున్న హిమానీనదం..ప్రమాదంలో ఎవరెస్ట్ శిఖరం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook