Bheemla Nayak Music Copy Right Issue: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలన్నీ కూడా విశేష ఆదరణ పొందాయి. సాంగ్స్.. సినిమాపై మరింత అంచనాలు పెంచాయి.
మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియమ్"కు రీమేక్‌గా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కింది. భీమ్లా నాయక్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. అయితే ఇప్పడు ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీ నుంచి కొన్ని ట్యూన్స్‌ను తీసుకుని సేమ్ వాటినే ఇప్పుడు భీమ్లా నాయక్‌లో వాడుకున్నారంటూ వివాదం చెలరేగుతోంది.
అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి జేక్స్ బెజాయ్ సంగీతం అందించారు. అయితే జేక్స్ బెజాయ్ ట్యూన్స్ భీమ్లా నాయక్ మూవీ కోసం తీసుకున్నా కూడా ఆల్బమ్‌లో ఎక్కడ కూడా జేక్స్‌కు క్రెడిట్ ఇవ్వలేదట. భీమ్లా నాయక్ మూవీకి మ్యూజిక్ అందించిన థమన్‌కే క్రెడిట్ అంతా దక్కుతుడడంతో జేక్స్ బెజాయ్ అసంతృప్తి లోనయ్యారు. దీంతో జేక్స్ బెజాయ్ కాపీరైట్ ఇష్యూని లేవనెత్తేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సమస్యను ఐపీఆర్‌ఎస్ (ది ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్)ను సంప్రదించాలని భావిస్తున్నాడట. ఇక ఈ విషయంపై ఎస్ఎస్ థమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. కాగా భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ అందించారు. ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటించారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. సాగర్ కే చంద్ర డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కింది.
Also Read: Gujarat Titans: అహ్మదాబాద్ టైటాన్స్ కాదు.. టీమ్ పేరును ప్రకటించిన అహ్మదాబాద్ ప్రాంచైజీ!!
Also Read: Rishabh Pant Opener: వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రిషబ్ పంత్ ఓపెనర్‌గా రావడానికి కారణం ఇదే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook