/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

రైల్వే మంత్రి పియూష్ గోయల్ తీరు పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో మాట్లాడేందుకు టీడీపీ ఎంపీల అపాయింట్ మెంట్ ను కాదని.. వైసీపీ ఎంపీని పిలిపించుకని మరి మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే ఈ రోజు ఉదయం తమ పార్టీకి చెందిన ఎంపీలతో చంద్రబాబు  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో టీడీపీ ఎంపీలు మాట్లాడుతూ రైల్వే జోన్ గురించి చర్చించేందుకు రైల్వే మంత్రి అపాయింట్ కోరితే తనకు బీజీ షెడ్యూల్ అని చెప్పి.. వైసీపీ ఎంపీకి పిలిపించుకొని మరి మాట్లాడారనే విషయాన్ని చంద్రబాబుకు వివరించారు. తాజా పరిణామంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీకి మిత్రపక్షం ఎవరు ? 

రైల్వే మంత్రి తీరును ఖండించిన చంద్రబాబు.. అసలు బీజేపీకి మిత్రపక్షం వైసీపీనా? టీడీపీయా? అన్న సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు విషయంలో రాజీలేని పోరాటం చేయాలని ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అలాగే ఉభయసభల్లో  రాష్ట్ర సమస్యలు ప్రతిధ్వనించాలని ఎంపీలను కోరారు. కేంద్రంపై దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా పోరాటం సాగించడం వల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వెల్లడించినట్లు తెలిసింది. ఆర్థిక బిల్లులపై చర్చ జరుగుతన్న వేళ.. రాష్ట్రానికి హోదా, విభజన హామీలపై గళం ఎత్తాలని సూచించిన చంద్రబాబు ..టీడీపీ పీలందరూ సభకు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. 

Section: 
English Title: 
Railway Minister Rejects the TDP MPs appoint
News Source: 
Home Title: 

టీడీపీ వారిని కాదని వైసీపీ ఎంపీకి రైల్వే మంత్రి అపాయింట్‌మెంట్ !

టీడీపీ వారిని కాదని వైసీపీ ఎంపీకి రైల్వే మంత్రి అపాయింట్‌మెంట్ !
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
టీడీపీ వారిని కాదని వైసీపీ ఎంపీకి రైల్వే మంత్రి అపాయింట్‌మెంట్ !