Lata Mangeshkar: భారత స్వరకోకిల, భారతరత్న లతా మంగేష్కర్ ఇకలేరు. ఆమెకు పేరు తెచ్చిన అయ్ మేరే వతన్‌కే లోగో ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. చివరి పాట కూడా అదే ఇండియన్ మిలట్రీపై పాడటం యాధృచ్ఛికమా..ఎలా సాధ్యం
భారత లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కాస్సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో గత కొద్దికాలంగా చికిత్స పొందుతూ మరణించారు. జనవరి 8వ తేదీన కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన లతా మంగేష్కర్ కొద్దిరోజుల్లో కోలుకున్నారు. అయితే ముందు నుంచే ఆమెకు శ్వాస సంబంధ సమస్యలుండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స కొనసాగించారు. మొన్నటి నుంచి ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అదే ఆసుపత్రిలో చివరి శ్వాస తీసుకున్నారు.
లతా మరణం మొత్తం దేశానికి తీరని దిగ్భ్రాంతి కల్గించింది. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అంతా నివాళి అర్పిస్తున్నారు. ఆమె మరణవార్త వినగానే లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పిస్తూ పోస్టింగులు అధికమైపోయాయి. 1929లో జన్మించిన లతా మంగేష్కర్ దశాభ్దాలుగా పాటలతో అందర్నీ మైమరపించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లెజెండరీ సింగర్ పాడిన చివరి పాట గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. లతా మంగేష్కర్‌కు పేరు తెచ్చిన పాటగా..ఇప్పటికీ అందరి నోటా విన్పిస్తున్న పాటగా, ఎప్పుడు విన్నా భక్తి పారవశ్యం పొంగి..కంట నీరు రప్పించే పాటగా పేరు గాంచింది..అయ్ మేరె వతన్‌కే లోగో..దేశ సైనికుల త్యాగాలకు గుర్తుగా పాడిన పాట ఇది. భారతదేశ ఆర్మీకు ఒక ట్రిబ్యూట్‌గా ఈ పాట ప్రదర్శిస్తుంటారు.
యాధృచ్ఛికమో మరేంటో తెలియదు కానీ..లతా పాడిన చివరి పాట(Lata Mangeshkar Last Song) కూడా ఇండియన్ మిలట్రీ గురించి పాడిందే. దేశభక్తిని రగిలించిన పాటే. దేశ సైనికుల త్యాగాలకు నివాళిగా పాడిన పాటే. సౌగంధ్ ముఝే ఇస్ మిట్టీ కి..అంటూ సాగే ఈ పాట అయ్ మేరే వతన్‌కే లోగో పాటను గుర్తు తెస్తోంది. మయురేష్ పాయ్ కంపోజ్ చేసిన ఈ పాట 2019 మార్చ్ 30 న విడుదలైంది. ఇది కాకతాళీయమో ఏంటో గానీ ఆమెకు పేరు తెచ్చిన పాట...చివరి పాట ఇండియన్ మిలట్రీకు నివాళిగా సాగిన పాటే కావడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Lata Mangeshkar: లతాకు పేరు తెచ్చిన పాట..చివరి పాట కూడా ఇండియన్ మిలట్రీపైనే..