Guntur: సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కాడు... చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

Piduguralla: ఓ యువకుడి సెల్ఫీ పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది.  గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీలు తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 02:42 PM IST
  • సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కిన యువకుడు
  • గుంటూరు జిల్లాలో ఘటన
Guntur: సెల్ఫీ కోసం గూడ్స్ రైలు ఎక్కాడు... చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

Selfie on Goods Train: సెల్ఫీల మోజులో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీల కోసం రిస్క్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో (Guntur District) ఓ యువకుడి సెల్ఫీ (Selfie) పిచ్చి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. సదరు యువకుడు క్రేజీగా గూడ్స్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. అయితే విద్యుత్ వైర్లు తగిలి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. 

అసలేం జరిగిందంటే...
గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు (Piduguralla) చెందిన వీరబ్రహ్మం యువకుడు ఇంటర్ వరకూ చదివాడు. ఇంటి వద్దే ఉంటున్న బ్రహ్మం బుధవారం సాయంత్రం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ కు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. నడికూడి నుంచి చెన్నై వెళ్లే గూడ్స్ రైలు (Goods Train) ఫ్లాట్ ఫాంపై ఆగి ఉంది. గమనించిన వీరబ్రహ్మం గార్డు ఉండే బోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు.

Also Read: Girl Prostitution Case: అమ్మాయితో వ్యభిచారం.. ఇరుక్కుపోయిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు

ఈ క్రమంలో అతనికి కొద్ది ఎత్తులోనే ఉన్న విద్యుత్ తీగలను గమనించని బ్రహ్మం సెల్ఫీలు దిగుతుండగా...కరెంటు తీగలు తగిలి పడిపోయాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పి యువకుడి దుస్తులు తొలగించారు. అనంతరం రైల్వే పోలీసులు (Railway Police) బాధితుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News