Maharashtra: మహారాష్ట్ర థానే జిల్లాలో (Thane district) విషాదం చోటుచేసుకుంది. భివాండీ తహసీల్‌లో ఇటుక బట్టీలకు ఉపయోగించే బొగ్గును అన్లోడ్ చేస్తుండగా ట్రక్కు పడి ముగ్గురు చిన్నారులు (3 minor sisters killed) చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడం గమనార్హం. అందులోనూ వారి వయసు కేవలం ముూడు నుంచి ఏడేళ్లులోపు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన టెంబివిలి గ్రామంలో (Tembivili village) చోటుచేసుకుంది.
ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఈమె కూడా చనిపోయిన ముగ్గురు చిన్నారుల సోదరి కావడం విశేషం. మృతి చెందిన వారి తల్లిదండ్రులు ఆ ఇటుక బట్టీల వద్ద కార్మికులుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనతో సంబంధం ఉన్న ఇటుక బట్టీ యజమాని సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Bihar Protests: ఆర్ఆర్‌బీ ఫలితాలపై వివాదం.. అట్టుడుకుతున్న బీహార్.. రైలుకు నిప్పంటించిన విద్యార్థులు
అరెస్టు చేసిన వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304 A కింద పోలీసులు కేసు నమోదు చేశారు, తరువాత వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వారిని రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. ఇటుక బట్టీ యజమాని గోపీనాథ్ మద్వి, బొగ్గు తీసుకు వచ్చిన సురేష్ రాందాస్ పాటిల్, ట్రక్కు డ్రైవర్ తౌఫిక్ షేక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Maharashtra: విషాదం... ట్రక్కు పడి ముగ్గురు చిన్నారులు మృతి
మహారాష్ట్రలో విషాదం
చిన్నారులపై పడిన ట్రక్కు
ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం