Green Channel in Hyderabad: హైదరాబాద్‌లో రెండు గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు ద్వారా గుండె, ఊపిరితిత్తుల తరలింపు

Green Channel for live organs heart and lungs in Hyderabad: హైదరాబాద్‌లో రెండు గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు చేసి గుండె, ఊపిరితిత్తుల తరలింపు. సికింద్రాబాద్ యశోద నుంచి మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌కు, బేగంపేట విమానాశ్రయం నుంచి కిమ్స్ హాస్పిటల్‌కు లైవ్ ఆర్గాన్స్‌ తరలించిన వైద్యులు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 06:42 PM IST
  • మరోసారి గొప్ప మనసు చాటుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
  • రెండు గ్రీన్ ఛానెల్‌లల ఏర్పాటు
  • అవయవాలను అతి వేగంగా తరలించేందుకు సాయం చేసిన పోలీసులు
Green Channel in Hyderabad: హైదరాబాద్‌లో రెండు గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు ద్వారా గుండె, ఊపిరితిత్తుల తరలింపు

Green Channel in Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. రెండు గ్రీన్ ఛానెల్‌లను ఏర్పాటు చేసి మనిషి లైవ్ ఆర్గాన్స్‌ను అతి వేగంగా తరలించేందుకు సాయపడ్డారు. అత్యవసరానికి గుండె, (Heart) ఊపిరితిత్తులు (Lungs) తరలించేలా చేశారు. గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు ద్వారా బేగంపేట (Begumpet) విమానాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి (Kims Hospital) గుండెను తరలించారు వెద్యులు. 

అలాగే సికింద్రాబాద్ (Secunderabad) యశోద హాస్పిటల్‌ (Yashoda Hospital) నుంచి మలక్‌పేట్ యశోద ఆసుపత్రికి ఊపిరితిత్తులను మరో వైద్య బృందం తరిలించింది. అంబులెన్స్‌లకు నాన్‌స్టాప్ కదలికను అందించడం కోసం పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను (Traffic‌) అదుపు చేశారు. ఇలా రెండు గ్రీన్ ఛానెల్‌ల ఏర్పాటు ద్వారా గుండె, ఊపిరితిత్తులను చాలా సులభంగా వైద్యులు తరలించగలిగారు.

 

ఇక కొన్ని రోజుల క్రితం కూడా రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఇలానే గొప్ప మనసు చాటుకున్న విషయం తెలిసిందే. గ్రీన్ ఛానెల్ ఏర్పాటు ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తుల్ని.. ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్ నుంచి బేగంపేట (Begumpet) కిమ్స్ హాస్పిటల్‌కు తరలించిన విషయం తెలిసిందే.

బేగంపేట, ఎల్బీ నగర్ మధ్య గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి కేవలం 15 నిమిషాల్లోనే అవయవాలను చేర్చేలా చేశారు కమిషనరేట్ పోలీసులు. అలాగే గతేడాది సెప్టెంబర్‌లో కూడా పోలీసులు (Police) ఇలాగే గ్రీన్ ఛానెల్‌ ఏర్పాటు చేసి ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్‌లోని కిమ్స్‌కు చాలా తక్కువ టైమ్‌లోనే ఊపిరితిత్తులను తరలించేందుకు సాయ పడ్డారు.

Also Read: AP Corona cases: ఏపీలో ఆగని కరోనా కల్లోలం- ఒక్క రోజులో 9 మంది మృతి!

అయితే సాధారణంగా బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయిన వ్యక్తుల నుంచి ఇలా గుండె, ఊపిరితిత్తులులాంటి లైవ్ ఆర్గాన్స్‌ను సేకరించి, వాటిని ఆయా ఆర్గాన్స్‌ (Organs‌) అవసరమైన వారికి అమర్చుతుంటారు. ఈ క్రమంలో చాలా వేగంగా అవయవాలను పేషెంట్‌ దగ్గరకు చేర్చి అమర్చాల్సి ఉంటుంది. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి ఉన్న చోటు నుంచి అవయవాలు అవసరమైన పేషెంట్‌ ఉండే చోటుకు గ్రీన్ ఛానెల్‌ ఏర్పాటు ద్వారా వేగంగా అవయవాలను (Live Organs‌) తీసుకెళ్లడానికి వీలు అవుతుంది. పోలీసులు (Police) గ్రీన్ ఛానెల్‌ ఏర్పాటు ద్వారా అవయవాలను తీసుకెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపేసి అంబులెన్స్‌కు మార్గం సులువు చేస్తారు.

Also Read : కోహ్లికి ఉన్నంత ఎనర్జీ ధోనికి లేదు... సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News