India Corona Cases Today: ఇండియాలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 4 కోట్లకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,85,914 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వైరస్‌తో మరో 665 మంది మరణించారు.
మరోవైపు కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,00,85,116 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,91,154 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 22,23,018 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,73,70,971 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports 2,85,914 new #COVID19 cases, 665 deaths and 2,99,073 recoveries in the last 24 hours
Active case: 22,23,018
Daily positivity rate: 16.16%Total Vaccination : 1,63,58,44,536 pic.twitter.com/hpxnJKfSep
— ANI (@ANI) January 26, 2022
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 59,50,731 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,58,44,536 కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 33,69,091 మందికి కరోనా సోకింది. 9,837 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 35,90,91,892కి చేరగా.. మరణాలు 56,33,593కు పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.