COVID-19 Vaccines 62 lakh Covid vaccine doses wasted in India : జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బానా గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో దాదాపు 62 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు (62 lakh Covid vaccines) వృథా అయ్యాయని ఆయన ఆరోపించారు. జార్ఖండ్‌లో (Jharkhand) కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వృథా అయ్యాయనే ఆరోపణలపై మంత్రి బానా గుప్తా (Jharkhand Health Minister Bana Gupta) స్పందించారు. ఒడిశా, గుజరాత్, అస్సాం, త్రిపురతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 29 లక్షలకు పైగా (Over 29 lakhs) వ్యాక్సిన్ డోసులు వృథా అయ్యాయని జార్ఖండ్ హెల్త్ మినిస్టర్ బానా గుప్తా (Health Minister Bana Gupta) పేర్కొన్నారు.
ఇక జార్ఖండ్‌లో కొవిడ్ మరణాల (Covid deaths) సంఖ్య ఏమీ పెరగడం లేదని చెప్పుకొచ్చారు మంత్రి బానా గుప్తా. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయన్నారు. అయితే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, (multi organ failure) ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో కొందరు మరణించారని పేర్కొన్నారు. ఇక జార్ఖండ్‌లో ఇప్పటివరకు కోవిడ్ 19, ఒమిక్రాన్ (Omicron) కారణంగా ఎవరూ మరణించలేదన్నారు.
#WATCH | About 62 lakh vaccines wasted nationally...over 29 lakh wasted in Odisha, Gujarat, Assam, Tripura... and BJP-ruled states....: Jharkhand Health Minister Bana Gupta on vaccine wastage allegation against the state pic.twitter.com/kKTHYJlgQA
— ANI (@ANI) January 19, 2022
Death numbers are not increasing, situaiton is normal...some deaths have occurred due to multi-organ failure/co-morbidities..so far no case suggesting death due to Covid 19 or Omicron: Jharkhand Health Minister Banna Gupta pic.twitter.com/bjLI9ur7GQ
— ANI (@ANI) January 19, 2022
మరో పక్క భారత్‌లో కొవిడ్ (Covid in India) విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ప్రజల కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియను ప్రారంభించి జనవరి 16నాటికి ఏడాది అయింది. గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్ ఇవ్వడంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్ధులకు వ్యాక్సిన్ (Vaccine) ఇవ్వడాన్ని ప్రారంభించారు.
Also Read : Flights Collision: గాల్లో ఎదురెదురుగా వచ్చిన 2 ఇండిగో విమానాలు.. ఆ తర్వాత ఏమైంది?
ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభమైంది. ఇక మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. జనవరి 3, 2022 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ (Covid vaccine distribution) కార్యక్రమం ప్రారంభమైంది. ఇక ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియెంట్‌ను ఎదుర్కొనేందుకుగాను బూస్టర్ వ్యాక్సిన్ డోసు (booster vaccine) అందుబాటులోకి వచ్చింది.
Also Read : Petrol on subsidy: లీటర్ పెట్రోల్‌పై 25 రూపాయల సబ్సీడీకి ఆధార్ కార్డు తప్పనిసరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook