చైనా సరికొత్త అధ్యాయం.. జీవితకాలం అధ్యక్షుడిగా జిన్ పింగ్

చైనా పార్లమెంట్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చైనా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి కాలపరిమితిని తొలగిస్తూ చైనా పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Last Updated : Mar 12, 2018, 11:42 AM IST
చైనా సరికొత్త అధ్యాయం.. జీవితకాలం అధ్యక్షుడిగా జిన్ పింగ్

చైనా పార్లమెంట్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. చైనా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి కాలపరిమితిని తొలగిస్తూ చైనా పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ జీవితాంతం చైనా అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆదివారం చారిత్రాత్మక రాజ్యాంగ సవరణను జారీ చేసింది. జీ జిన్‌పింగ్‌ 2023 తరువాత కూడా చైనా అధ్యక్షుడిగా ఉండడానికి అధికారికంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది.

దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, చైనా లెజిస్లేచర్‌లో రాజ్యాంగ సవరణ స్వీయ మార్పులకు దాదాపు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.  2,958 ఓట్లు అనుకూలంగా పడ్డాయి. కేవలం రెండు ఓట్లు మాత్రమే వ్యతిరేకంగా పోలయ్యాయి అని తెలిపింది. కమ్యునిస్ట్ పార్టీకి చైనా లెజిస్లేచర్‌లో గట్టి బలమే ఉంది. కాబట్టి భారీగానే ఓట్లు పోలయ్యాయి.

1982లో డెంగ్ జియావోపింగ్ కాలంలో..అప్పటి ప్రభుత్వం ఏ వ్యక్తి అయినా అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలని చట్టం చేసింది. ఆ తరువాత మళ్లీ 36 సంవత్సరాలకు రాజ్యాంగ సవరణ చేశారు.

మొత్తం 21 అంశాలను రాజ్యాంగంలో సవరించి చేర్చారు. రాజ్యంగ పీఠిక భాగంలో నాలుగు, ఉపాంగములో 17 సవరణలు చేసి, కొత్తవాటిని చేర్చారు. పరిమితులు అనే పదాన్ని రాజ్యాంగం నుండి తొలగించారు.  కొత్త రాజ్యాంగ సవరణ ద్వారా యాంటీ-గ్రాఫ్ట్ సూపర్ ఏజెన్సీ, నేషనల్ సూపర్వైజరీ కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగుమం అయ్యింది.

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వేతర సంస్థల అధికారులు, మేనేజర్లు, ఉపాధ్యాయులు, వైద్యులు, పాత్రికేయులందరిపై కొంత మేరకు నియంత్రణ పెట్టే అధికారాన్ని కూడా ప్రభుత్వం పొందింది.

2012లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జీ జిన్‌పింగ్‌ (64) అధికారంలో ఉన్నారు. జిన్‌పింగ్‌ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి 2023లో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి. కానీ జిన్‌పింగ్‌ చైనాను ప్రపంచ శక్తిగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన విజన్‌కి ఏవీ కూడా అడ్డురాకూడదని రాజ్యాంగ సవరణ చేపట్టారు.

Trending News