Gold Price Today : దేశీయ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు.. పూర్తి వివరాలివే...

Gold Price Today January 14 2022 : బంగారమంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. ఏ చిన్న శుభకార్యమైనా కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి...

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 10:48 AM IST
  • దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు
  • ఢిల్లీలో రూ.1600 మేర పెరిగిన గోల్డ్ రేటు
  • తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఒకే ధరలు
Gold Price Today : దేశీయ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు.. పూర్తి వివరాలివే...

Gold Price Today January 14 2022 : దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ (జనవరి 14) బంగారం ధర రూ.1600 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,940 ఉండగా.. ఇవాళ అది రూ.47,100కి చేరింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా స్థానిక ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుననే విషయం గమనించాలి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 

హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,010గా ఉంది. నిన్నటితో పోలిస్తే కేవలం రూ.10 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,010గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.90 మేర ధర తగ్గింది.

విజయవాడలోనూ ఇంచుమించుగా హైదరాబాద్ మార్కెట్‌లోని ధరలే కొనసాగుతున్నాయి. ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,010గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,940 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,230గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,260
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,260గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,110గా ఉంది. 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800గా ఉంది.

 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,220 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,010 వద్ద కొనసాగుతోంది.

Also Read: RRR : పండగ వేళ 'ఆర్ఆర్ఆర్' కొత్త పోస్టర్.. ఎన్టీఆర్, చెర్రీ వింటేజ్ లుక్ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News