Covid 19 Cases 14th January 2022, India reports 264202 fresh Corona cases and 109345 recoveries: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి భారత్ (India)ను కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ మధ్య కాస్త అదుపులో ఉన్న మహమ్మారి.. ఇటీవల పంజా విసురుతోంది. ముఖ్యంగా గత వారం రోజులుగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో 2,64,202 మందికి కరోనా సోకినట్లు సమాచారం. బుధవారంతో పోల్చుకుంటే.. గురువారం (Covid 19 Cases 14th January 2022) 6.7 శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి.
బుధవారం రోజున 1,09,345 మంది కరోనా వైరస్ (Covid 19) మహమ్మరి నుంచి కోలుకున్నారని ఓ జాతీయ మీడియా తమ కథనంలో వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇక దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) కేసుల సంఖ్య 5,753కు చేరింది. ప్రస్తుతం భారత్‌లో 12,72,073 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే రోజురోజుకు రికవరీ కేసుల సంఖ్య పెరగడం సంతోషించాల్సిన విషయం.
India reports 2,64,202 fresh COVID cases (6.7% higher than yesterday) and 1,09,345 recoveries in the last 24 hours
Active case: 12,72,073
Daily positivity rate: 14.78%Confirmed cases of Omicron: 5,753 pic.twitter.com/GGQ8P7TzRZ
— ANI (@ANI) January 14, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి