Sun transit in capricorn : మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ 4 రాశుల వారు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది..

Sun transit in capricorn 2022 : జనవరి 14న మకరరాశిలోకి సూర్యుడు. సూర్యుడి పరివర్తనంతో ఆ నాలుగు రాశుల వారికి జాతకాలే మారనున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 11:43 AM IST
  • జనవరి 14న మకరరాశిలోకి సూర్యుడు
  • సూర్యుడి రాశి పరివర్తనంతో కొన్ని రాశుల వారికి మేలు
  • నాలుగు రాశుల వారికి అంతా అదృష్టమే
Sun transit in capricorn : మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశం.. ఈ 4 రాశుల వారు ఏది అనుకుంటే అది జరిగిపోతుంది..

Sun transit in capricorn 2022 these 4 zodiacs get good days from january 14 : ఈ కొత్త సంవత్సరంలో సూర్యుడు రాశి మారబోతున్నాడు. సూర్యుడి పరివర్తనం (Suntransit) వల్ల ఈ 2022లో కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. జనవరి 14న సూర్యుడి పరివర్తనం జరగనుంది. ప్రస్తుతం సూర్యుడు ధనస్సు రాశిలో (Sagittarius) ఉన్నాడు.

జనవరి 14న (January 14) సూర్యుడు మకరరాశిలోకి (Capricorn) ప్రవేశిస్తారు. సూర్యుడు అన్ని రాశులకు రాజుగా ఉంటాడు కాబట్టి.. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం సూర్యుడు రాశి మారినప్పుడల్లా కొన్ని రాశుల వారికి అద్భుతమైన మేలు జరుగుతుంది. వారి జీవితాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతాయి. అప్పటి వరకు జీవితంలో చూడని విజయాలన్నీ ఒక్కసారిగా దరి చేరుతాయి. వారు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది.

ఈ సారి సూర్యుడి రాశి పరివర్తనం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరగనుంది. ఆ రాశులు ఏమిటి.. వారికి కలిగి ప్రయోజనాలు ఏమిటో చూడండి.

వృషభం: (Taurus)
సూర్యుడి రాశి (Sun transit in capricorn 2022) మార్పు వృషభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించగానే ఈ రాశికి వారికి అదృష్టం వరిస్తుంది. సూర్యుడు మకరరాశిలో ఉన్నంత కాలం వీరు ఏ పని తలపెట్టినా కూడా వెంటనే జరిగిపోతుంది. అన్నీ అనుకూలమైన ప్రయోజనాలే లభిస్తాయి. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సూర్య భగవానుడికి ఉదయం పూ నీటిని సమర్పిస్తూ పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది.

సింహం: (Leo)
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల (Sun transit in capricorn) సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా వెంటనే పూర్తవుతాయి. వ్యాపారపరంగా రావాల్సిన డబ్బు వెంటనే వస్తుంది.

వృశ్చికం: (Scorpio)

సూర్యుడి రాశి పరివర్తనం వల్ల (Sun transit) ఈ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు చేస్తోన్న పనికి గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు వస్తాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సూర్యుడి పరివర్తనం వల్ల లాభాలు బాగా వస్తాయి.

Also Read : Happy Birthday Yash: నేడు రాకింగ్ స్టార్ యశ్ బర్త్​ డే- కేజీఎఫ్​-2 నుంచి అప్​డేట్​!

మకరం : (Capricorn)
సూర్యు రాశి పరివర్తనం మకరరాశిలోకే (Sun transit in capricorn 2022) జరగడం వల్ల ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. ఈ రాశి (zodiac signs) వారు చాలా ప్రయోజనాలను పొందనున్నారు. ఉద్యోగంలో ప్రశంసలు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది.

Also Read : Platform Ticket Rate Hiked: సంక్రాంతి ఎఫెక్ట్... రైల్వే ప్రయాణికులకు షాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News