Rahul Dravid on Kohli: సౌతాఫ్రికాతో జరగాల్సిన రెండో టెస్టు కోసం టీమ్ఇండియా సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ టీమ్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పలు వ్యాఖ్యలు చేశాడు. 20 రోజులకు పైగా కోహ్లీ కెప్టెన్సీ అంశంపై చర్చలు జరుగుతున్న సమయంలో అతడు అద్భుతంగా వ్యవహరించాడని అన్నాడు.
"గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అంశంపై చర్చ జరుగుతోంది. అయినా అతడు బాగా రాణించాడు. జట్టు సభ్యులతో మునుపటిలానే ఉన్నాడు. ఇన్ని చర్చల నడుమ ఆటకోసం తను సిద్ధమైన విధానం అద్భుతం" అని టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ ఇప్పటివరకూ మీడియా ముందు హాజరుకాలేదు. దీనిపై స్పందించిన ద్రవిడ్.. కోహ్లీ అలా చేయడానికి ప్రత్యేక కారణమేమీ లేదని తెలిపాడు. బహుశా కోహ్లీ తన 100వ టెస్టు సందర్భంగా మీడియా ముందుకు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.
సౌతాఫ్రికాతో మరో రెండు టెస్టులు ఆడనుంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తే.. భారీగా పరుగులు చేయగలడని అన్నాడు రాహుల్ ద్రవిడ్. గత రెండేళ్లుగా విరాట్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా 3వ టెస్టు కోహ్లీ 100వ టెస్టు కానుంది. ఈ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభంకానుంది.
Also Read: Mohammed Siraj: అలా చేయడం బాలేదు.. సిరాజ్ దూకుడు గురించి ఎవరైనా మాట్లాడాలి: గవాస్కర్
Also Read: Virat Kohli: కోహ్లీ పేరు పక్కన అది లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది.. సమయం పడుతుంది: ఆకాష్ చోప్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి