Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్' (Radhe Shyam Movie). కేకే రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas) జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. పరమహంస అనే పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పోస్ట్రర్స్, సాంగ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా జస్టిస్ ప్రభాకర్ వ్యవహారిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (Background Music) కోసం సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) తో ఒప్పందం చేసుకున్నారు మేకర్స్. రాధేశ్యామ్ సినిమాకు దక్షిణాది భాషలకు తమన్ బీజీఎం (BGM) అందిస్తాడని యూవీ క్రియేషన్స్ (Uv Creations) ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇటీవల బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికి బీజీఎం హైలెట్‌గా నిలిచింది. దీంతో థమన్ ను బీజీఎం కోసం తీసుకున్నారు. అయితే సినిమా విడుదలకు మరో 20 రోజుల ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో సినిమా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
We are pleased to welcome the young music maestro @MusicThaman to score the BGM of #RadheShyam for South Languages!#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs pic.twitter.com/S2T1r568IE
— UV Creations (@UV_Creations) December 26, 2021
Also Read: Radhe Shyam Trailer: ప్రేమ, పెళ్లి లేవంటున్న ప్రభాస్..'రాధేశ్యామ్' ట్రైలర్ అదుర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి