Instagram Love & Kidnap: సోషల్ మీడియా ప్రేమ వ్యవహారాలు వద్దని ఎంతగా చెబుతున్నా అమ్మాయిలు ఆ వలలో పడిపోతున్నారు. ఇలాగే ఇన్‌స్టా ప్రేమ వలలో పడి కిడ్నాప్‌కు గురైంది ఆ అమ్మాయి.. వివరాలివీ..
సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో..అన్ని దుష్ఫ్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా స్నేహం, ప్రేమ వ్యవహారాల పట్ల యువత చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా ప్రేమలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఇలాగే ప్రాణాలపై తెచ్చుకోవల్చి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడ గ్రామానికి చెందిన ఓ యువతితో..పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కొత్త పూసలమర్రుకు చెందిన మోకా ఫణీంద్ర ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) పరిచయం పెంచుకున్నాడు. చాటింగ్ ద్వారా మాయమాటలు చెబుతూ ప్రేమలో దించాడు. అనుకున్న పథకం ప్రకారం ఈ నెల 15వ తేదీన లాంగ్ డ్రైవ్ అని చెప్పి..రాజానగరం నుంచి భీమవరం సమీపంలోని 31వ వార్డులోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. బంగారు ఛైన్, చెవి దుద్దులు తీసుకుని కాళ్లు చేతులు కట్టేసి..ఇంటిని లాక్ చేసేశాడు. ఆ తరువాత ఆమె తండ్రికి ఫోన్ చేసి..నీ కూతుర్ని కిడ్నాప్(Kidnap)చేశానని..5 లక్షలిస్తేనే వదిలి పెడతానంటూ బెదిరించారు. తక్షణం ఆ యువతి తల్లిదండ్రులు రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన రాజమండ్రి అర్బన్ పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి గాలింపు ప్రారంభించారు. అటు ఇంట్లో బందీగా ఉన్న ఆ యువతి తలుపులు గట్టిగా బాదడంతో..స్థానికులు గమనించారు. స్థానిక వార్డు మహిళా పోలీసుకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న రాజమండ్రి అర్బన్ పోలీసులు(Rajahmundry Urban Police)అక్కడికి చేరుకుని ఆ యువతిని రక్షించారు. అదృష్టవశాత్తూ ఆమె సేవ్ అయింది. లేకపోతే ఏ అనర్ధం జరిగుండేదోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Also read: Andhra Pradesh: మందుబాబులకు శుభవార్త...ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook