Omicron scare: ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో ఒమిక్రాన్​ - యూకేలో మళ్లీ లాక్​డౌన్​!

Omicron cases around the world: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రెట్టింపయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ​ (డబ్ల్యూహెచ్​ఓ) ఆందోళన వ్యక్తం చేసిది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 08:32 AM IST
  • డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి
  • మూడు రోజుల్లోనే రెట్టింపైన కేసులు
  • ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
  • లాక్​డౌన్ దిశగా యూకే అడుగులు
Omicron scare: ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో ఒమిక్రాన్​ - యూకేలో మళ్లీ లాక్​డౌన్​!

Omicron cases around the world: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రెట్టింపైనట్లు వరల్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ​ (డబ్ల్యూహెచ్​ఓ) ఆందోలన వ్యక్తం (Omicron scare) చేసిది.

సామాజిక వ్యాప్తి దశలో ఉన్న డెల్టా వేరియంట్​తో పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించింది డబ్ల్యూహెచ్​ఓ.

డిసెంబర్ 16 నాటికి ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు బయటపడినట్లు డబ్ల్యూహెచ్​ఓ గుర్తించింది. ఈ వేరియంట్​పై మరింత డేటా అందుబాటులోకి వచ్చినందువల్ల..  దానిపై మరిన్ని వివరాలను వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ. డెల్టా వేరియంట్​తో పోలిస్తే.. ఒమిక్రకాన్​కు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉన్నట్లు (Omicron fears world wide) పేర్కొంది.

డెల్టా వేరియంట్​తో పోలిస్తే.. ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తిచెందుతున్నప్పటికీ.. దాని తీవ్రత ఎలా ఉందనే విషయంపై ప్రస్తుతం పరిమిత డేటా మాత్రమే అందుబాటులో ఉందని తెలిపింది. అందువల్ల ఒమిక్రాన్​ సోకిన వారిపై ఎలాంటి ప్రభావం పడొచ్చనే విషయాన్ని అర్థం చేసుకోవానికి కాస్త సమయం పట్టే అవకాశముందని వివరించింది. వ్యాక్సిన్​ల ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిఉందని (WHO on Omicron variant) వెల్లడించింది.

ఆ దేశాల్లో భారీగా కేసులు..

దక్షిణాఫ్రికా, బ్రిటన్​లలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఫలితంగా రానున్న రోజుల్లో ఆయా దేశాల్లో ఆస్పత్రులు బెడ్లు పూర్తిగా నిండే అవకాశమున్నట్లు వివరించింది.

బ్రిటన్​లో లాక్​డౌన్​?

దేశంలో కరోనా కేసులు (ఒమిక్రాన్​ వేరియంట్​తో పాటు) భారీగా పెరుగుతున్ననేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కట్టడి చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్రిస్మస్​ తర్వాత రెండు వారాల పాటు లాక్​డౌన్ విధించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించేపనిలో ప్రభుత్వం (UK lockdwon) ఉన్నట్లు వెల్లడైంది.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. వృత్తి, ఉద్యోగ అవసరాలకు మినహా మిగతా సమావేశాలకు అనుమతి రద్దు చేయడం, బార్లు, రెస్టారెంట్ల పని వేళలు కుదించడం వంట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

బ్రిటన్​లో ఇటీవల ఒక్క రోజులోనే 93,045 కేసులు (Corona cases in UK) నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో ఇవే అత్యధికం.

Also read: Millipede: ప్రపంచంలోనే అత్యధిక కాళ్లున్న జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు...ఆస్ట్రేలియాలో గుర్తింపు..

Also read: Rare Pregnancy Case: అత్యంత అరుదైన ప్రెగ్నెన్సీ కేసు... ఆ మహిళ కాలేయంలో పిండం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News