D Srinivas: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ మరోసారి పార్టీ మారే యోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు (D Srinivas return to Congress) తెలుస్తోంది. ఇటీవలి పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తున్నాయి.
సోనియా గాంధీతో భేటీ..
సోనియా గాంధీతో డి. శ్రీనివాస్ గురువారం (D Srinivas meet with Sonia Gandhi) సమావేశమయ్యాయారు. సోనియా నివాసంలో 40 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా తాన జీవితం కాంగ్రెస్‌లోనే ముగియాలని నిర్ణయించుకున్నట్లు, తనకు పదవులపై వ్యామోహం లేదని కూడా సోనియాతో డి.శ్రీనివాస్ స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన.. తిరిగి పార్టీలో చేరేందుకు సోనియా అంగీకరించినట్లు సమాచారం.
అయితే పార్టీలో చేరిక ఎఫ్పుడు అనే విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ సహా ఇతర కీలక నేతలతో చర్చించిన తర్వాత.. డి.శ్రీనివాస్ పార్టీలో ఎప్పుడు చేరుతారేనే విషయంపై క్లారిటీ రానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ మారేందుకు కారణాలివేనా?
డి.శ్రీనివాస్ తొలుత కాంగ్రెస్‌లోనే కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా. మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. డి. శ్రీనివాస్ టీఆర్ఎస్లో (TRS Party) చేరారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్ నుంచి రాజ్య సభకు ఎంపికయ్యారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నుంచి డీఎస్‌కు టీఆర్ఎస్ పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కొంత మంది టీఆర్ఎస్ నేతలు డీఎస్‌కు వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్.. బీజేపీ నుంచి కవితపై పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందటంతో టీఆర్ఎస్తో డీఎస్‌కు సత్సంబంధాలు దెబ్బతిన్నాయని రాజకీయ విశ్లేషకులకు చెబుతుంటారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని.. డి.శ్రీనివాస్ తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరో ఆరు నెలల్లో రాజ్య సభ ఎంపీగా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో పార్టీ మారే విషయంపై డీఎస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also read: Omicron: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు...8కి చేరిన కేసుల సంఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
D Srinivas: మళ్లీ కాంగ్రెస్ గూటికి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్?
పార్టీ మారే యోచనలో డి.శ్రీనివాస్!
తిరిగి కాంగ్రెస్‌లో చేరే అవకాశం!
ఇటీవలే సోనియా గాంధీతో భేటీ