Bipin Rawat Helicopter Crash: ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడులోని వెల్లింగ్టన్ బేస్‌లో ఆర్మీ ఉన్నతాధికారుల ప్రత్యేక హెలీకాప్టర్ కూలిపోయింది. కూలిన హెలీకాప్టర్ భారత ఆర్మీలో చాలా ప్రత్యేకమైంది కావడం గమనార్హం.
భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ కుప్పకూలింది. తమిళనాడులోని కూనూరు వెల్లింగ్టన్ బేస్‌లో ఈ ప్రమాదం జరిగింది. హెలీకాప్టర్‌లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు మరో ఆరుగురు ఆర్మీ ఉన్నతాధికారులున్నారు. ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ క్షేమసమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక ఉన్నారు. ఇంకా బ్రిగేడియర్ లిద్దర్, కల్నల్ హర్జిందర్ సింగ్, పీఎస్ఓలు గురుసేవక్ సింగ్, జితేంద్రకుమార్, వివేక్ కుమార్, సాయితేజ్, సత్పాల్ ఉన్నారు. ప్రమాదంపై వాయుసేన తక్షణ విచారణకు ఆదేశించింది.
ఎంఐ 17 హెలీకాప్టర్ ప్రత్యేకత(MI 17 Helicopter Speciality)
బిపిన్ రావత్(Bipin Rawat) ప్రయాణం చేసిన ఆర్మీకు చెందిన ఎంఐ 17 (MI 17)హెలీకాప్టర్ ఇది. ఏకంగా 4 వేల పేలోడ్ తీసుకెళ్లగలిగే సామర్ధ్యమున్న డబుల్ ఇంజన్ హెలీకాప్టర్. ఇందులో 24 మంది ప్రయాణం చేసే అవకాశముంది. ఇక ప్రమాదం సమయంలో హెలీకాప్టర్‌లో ఏకంగా 14 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ నలుగురి మృతదేహలు కనుగొనగా, ముగ్గురిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Also read: Ukraine Dispute: ఉక్రెయిన్ జోలికొస్తే..సహించేది లేదంటూ అమెరికా వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి