Sirivennela Seetharama Sastry: అక్షరాలతో సిరివెన్నెల చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో నిలిచిపోతాయి: జగన్

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 06:27 PM IST
  • సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత
  • సిరివెన్నెల మృతిపై సీఎం జగన్‌ సంతాపం
  • అక్షరాలతో సిరివెన్నెల చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో నిలిచిపోతాయి
Sirivennela Seetharama Sastry: అక్షరాలతో సిరివెన్నెల చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో నిలిచిపోతాయి: జగన్

AP CM YS Jagan expresses condolences to Sirivennela Seetharama Sastry's Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry') కొద్ది నిమిషాల క్రితం కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం నిమోనియా కారణంగా హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు (నవంబర్ 30) సాయంత్రం మరణించారు. దాంతో మూడున్నర దశాబ్దాల పైగా వేలాది పాటలు రాసిన కలం ఒక్కసారిగా మూగబోయింది. సరళమైన పదాలతో వాడుక భాషలో సిరివెన్నెల రాసిన ఎన్నో వందల పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. సిరివెన్నెల కన్నుమూత తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood)కు తీరని విషాదాన్ని మిగిల్చింది. సిరివెన్నెల మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అని అన్నారు. 'తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగు వారికి తీరని లోటు. సిరివెన్నెల గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 

Also Read: Samantha Item Song Pushpa: ‘పుష్ప’ ఐటెం సాంగ్ లో సమంత ఫిక్స్.. త్వరలోనే ఫుల్ సాంగ్ రిలీజ్!

'ప్రఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Seetharama Sastry) గారి ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం. తెలుగు సినీ పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన కవి సామ్రాట్ ఆయన. సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) ట్వీట్ చేశారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్షనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సిరివెన్నెల మృతికి సంతాపం తెలిపారు. 

Also Read: 83 Trailer Out: కపిల్‌ దేవ్‌ 83 మూవీ ట్రైల‌ర్ వచ్చేసింది.. భారత అభిమానులకు గూస్ బంప్సే!!

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి (Sirivennela Seetharama Sastry) అస‌లు పేరు చంబోలు సీతారామ‌శాస్త్రి. సినిమాల్లోకి వచ్చాక సిరివెన్నెల ఆడ్ అయింది. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లిలో ఆయ‌న జ‌న్మించారు. తండ్రి సీవీ యోగి వేద‌పండితుడు, త‌ల్లి అమ్మాజి గృహిణి. ఇక సీతారామ‌శాస్త్రికి ఇద్ద‌రు అక్క‌లు, ఇద్ద‌రు సోద‌రులు. సినీ సాహిత్య‌ రంగంలో సీతారామ‌శాస్త్రి చేసిన సేవ‌ల‌కు గానూ కేంద్ర ప్ర‌భుత్వం ఆయనను ప‌ద్మ‌శ్రీ (Padma Shri) పుర‌స్కారంతో స‌త్క‌రించింది. సినీ కెరీర్‌లో 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డు (Filmfare Award)లు అందుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News