MP Shashi Tharoor Selfie with Women MP's: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్‌లో (Shashi Tharoor twitter) చేసిన ఓ పోస్టు వివాదాస్పదంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజు ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఫోటోను శశి థరూర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్టుకు ఆయన జోడించిన కామెంట్ వివాదానికి దారితీసింది. నెటిజన్లు థరూర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎంపీలపై సెక్సిస్ట్ రిమార్క్స్ చేయడమేంటని ప్రశ్నించారు. దీంతో శశి థరూర్ (Shashi Tharoor) తన పోస్టుకు క్షమాపణ చెప్పక తప్పలేదు.
'పనిచేసేందుకు లోక్‌సభ (Lok Sabha) ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరన్నారు... ఇవాళ ఉదయం ఆరుగురు మహిళా ఎంపీలతో నేను..' అని శశి థరూర్ ట్విట్టర్‌లో సెల్ఫీ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో (Shashi Tharoor Selfie with Women MP's) మహిళా ఎంపీలు సుప్రియా సూలే, ప్రణీత్ కౌర్, తమిజాచి, మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్, జ్యోతిమణి ఉన్నారు. అందరూ నవ్వుతూ సెల్ఫీకి పోజిచ్చారు. సెల్ఫీ వరకు బాగానే ఉన్నా.. దానిపై థరూర్ తన ట్విట్టర్ పోస్టులో చేసిన కామెంట్‌తో వివాదం మొదలైంది.
శశి థరూర్ తన కామెంట్‌లో 'ఎట్రాక్టివ్' అనే పదం వాడటాన్ని చాలామంది నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఒకరకంగా ఇది సెక్సిస్ట్ రిమార్క్ (Sexist remarks) అని మండిపడుతున్నారు. 'శశి థరూర్ గనుక ఎంపీ కాకుండా.. మరేదైనా రంగంలో ఉండి ఉంటే... ఆయన ఉపయోగించిన పదానికి ఈపాటికి ఆయన్ను బహిష్కరించి ఉండేవారు.' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్... 'ఆరుగురు మహిళా ఎంపీలతో దిగిన ఫోటోను షేర్ చేసి.. వాళ్ల కారణంగా లోక్‌సభ ఎట్రాక్టివ్‌గా ఉందని చెప్తున్నారు... దీని ద్వారా అసలు మీరేం చెప్పదలుచుకున్నారు. మీకు ఓటేసిన ప్రజల కోసం పనిచేసేందుకు ఎలాంటి ఎట్రాక్షన్స్ కావాలని మీరు కోరుకుంటున్నారు. ఒకవేళ మహిళా నాయకులు లేని లోక్‌సభ మీకు ఎట్రాక్టివ్‌గా అనిపించకపోతే రాజకీయాలను వదిలిపెట్టండి.' అని విమర్శించాడు.
Also Read: Viral Video: పెళ్లాం కొట్టిందని పోలీస్ స్టేషన్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన భర్త
నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన ఈ విమర్శలతో శశి థరూర్ క్షమాపణలు (Shashi Tharoor) చెప్పక తప్పలేదు. 'ఆ సెల్ఫీ వ్యవహారం చాలా స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. అదే స్పూర్తితో దాన్ని ట్విట్టర్‌లో షేర్ చేయమని మహిళా ఎంపీలే నన్ను అడిగారు. అయితే ఈ విషయంలో కొంతమంది నొచ్చుకున్నారు. అందుకు నన్ను క్షమించండి. ఏదేమైనా వాళ్లతో కలిసి సెల్ఫీ దిగడం సంతోషంగా ఉంది.' అని శశి థరూర్ చెప్పుకొచ్చారు.
The whole selfie thing was done (at the women MPs' initiative) in great good humour & it was they who asked me to tweet it in the same spirit. I am sorry some people are offended but i was happy to be roped in to this show of workplace camaraderie. That's all this is. https://t.co/MfpcilPmSB
— Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook