Bigg Boss Telugu 5 latest promo: బిగ్‌బాస్ షో రోజురోజుకీ ఆసక్తకరంగా మారుతోంది. కంటెస్టెంట్ల మధ్య దూరం తగ్గి..దగ్గరవుతున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ వారం లగ్జరీ బడ్జెట్ కోసం ‘బీబీ ఎక్స్‌ప్రెస్’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్(Bigg Boss). ఇందులో భాగంగా.. చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాల్సి ఉంటుంది.
ఈ టాస్క్ లో భాగంగా...మధ్యలో కుటుంబసభ్యులను ప్రవేశపెడుతూ...కంటెస్టెంట్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాడు బిగ్ బాస్(Bigg Boss). నిన్న కాజల్ భర్త, కూతురు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. తాజాగా నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో(latest promo) రిలీజ్ చేశాడు బిగ్ బాస్. ఇందులో మానస్ తల్లితో పాటు సిరి తల్లి(Siri Mother) కుడా వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Shruti Haasan Bigg Boss: బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించనున్న శ్రుతిహాసన్?
మానస్ తల్లి ఇంటిసభ్యులతో చాలా సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. జోక్ లు వేస్తూ..అందరినీ ఆటపట్టించారు మానస్ అమ్మగారు. కాజల్ చాయ్RJ Kajal) ఇవ్వనా అని అడగ్గా.. నీకు వంట చేయడం రాదుగా అంటూ పంచ్ వేసింది. శ్రీరామ్(Sriramchandra) ఆంటీ అని పిలవగా.. ‘ఎందుకు ఆంటీ అంటున్నావ్.. నేను నీ గర్ల్‌ఫ్రెండ్’అని అనడంతో ఇంటి సభ్యులంతా ఘొల్లున నవ్వారు.
ఆమె తర్వాత సిరి తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసిన వెంటనే సిరి ఎంతో ఎమోషనల్ అయ్యింది. ‘‘బాగా ఆడుతున్నావు. కానీ, షణ్ముఖ్(Shanmukh)ని నువ్వు కౌగిలించుకోవడం నాకస్సలు నచ్చడం లేదు. గేమ్స్ విషయంలో అతను సిరికి బాగా సాయం చేస్తున్నాడు. అందువల్ల సిరి అతనికి బాగా దగ్గరైపోతోంది. అది నాకు నచ్చడం లేదు’’ అని ఆమె చెప్పడంతో అక్కడే ఉన్న షణ్ముఖ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మరి సిరి తల్లి చేసిన కామెంట్స్ ను షణ్ముఖ్ ఎలా తీసుకున్నాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook