Rajya Sabha MP Subramaniam Swamy on Modi: బీజేపీ నేత, రాజ్య సభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. పాలన పరంగా అన్ని అంశాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
పశ్చిమ్ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో బుధవారం సమావేశమైన సుబ్రమణియణఅ్ స్వామి.. ఆమెపై పొగడ్తల జల్లు కురిపించారు. మరునాడే (గురువారం) మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం గమనార్హం.
మోదీ ప్రభుత్వ వైఫల్యాలు అంటూ ట్విట్టర్ వేదికగా సుబ్రమణియన్ స్వామి విమర్శలు చేశారు స్వామి. మోదీ రిపోర్ట్ కార్డ్ అంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఆర్థికంగా ఫెయిల్, సరిహద్దు భద్రత పరంగా ఫెయిల్ అని రాసుకొచ్చారు.
Modi Government's Report Card:
Economy---FAIL
Border Security--FAIL
Foreign Policy --Afghanistan Fiasco
National Security ---Pegasus NSO
Internal Security---Kashmir Gloom
Who is responsible?--Subramanian Swamy— Subramanian Swamy (@Swamy39) November 24, 2021
Also read: Truck: పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చిన లారీ.. ముగ్గురి మృతి (వీడియో)
అఫ్గాన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ విదేశీ విధానాల్లో విఫలమయ్యారని, పెగసస్ అంశన్ని ప్రస్థావిస్తూ.. జాతీయ భద్రత విషయంలో, కశ్మీర్ అంశాన్ని ప్రస్తావస్తూ.. దేశీయ భద్రత విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని స్వామి పేర్కొన్నారు. వీటన్నింటికి ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నించారు.
ఈ విషయంపై కామెంట్లలో పలువురు చేసిన ప్రశ్నలకు కూడా స్వామి చెప్పారు. కొంత మంది పెట్రోల్, డీజిల్ ధరల గురించి అడగ్గా.. మోదీనే అడగండి అంటూ సమాధానమిచ్చారు.
Also read: Road Accident: సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...కుటుంబం దుర్మరణం
మమతపై ప్రశంసల జల్లు..
బుధవారం మమతా బెనర్జీతో భేటీ అయిన స్వామి.. అమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆమెన్ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుల వంటి వారితో పాల్చారు. తాను కలిసిన నిఖార్సైన మనషి మమతా బెనర్జీనే అని పేర్కొన్నారు. అమె చెప్పిందే చేస్తారని.. రాజకీయాల్లో అది అరుదైన లక్షణమని వివరించారు.
అయితే సబ్రమణియన్ స్వామి సొంత పార్టీని, ప్రధాని మోదీని విమర్శించడం ఇది తొలిసారి కాదు. ఇందకు ముందు కూడా చాలా అంశాల్లో కేంద్రంపై విమర్శలు చేశారు స్వామి. మోదీ విధానాల్లో లోపాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతుంటారు.
Also read: Meghalaya Congress : మేఘాలయలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు
Also read: Kangana Ranaut : సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ నుంచి సమన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Subramanian Swamy: 'ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్నింటా ప్రభుత్వం ఫెయిల్'
ప్రధానిపై మరోసారి సుబ్బమణియన్ స్వామి ఫైర్
అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శలు
మోదీ రిపోర్ట్ కార్డు అంటూ ట్వీట్