South Central Railway: ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains)కు రైలు ట్రాక్(Railway Tracks Damaged)లు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో..మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 24, 25 తేదీల్లో ఐదు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) స్పష్టం చేసింది.
ఆ రైళ్లు రద్దు...
విజయవాడ డివిజన్‌లోని నెల్లూరు- పడుగుపాడు, గుంతకల్ డివిజన్‌లోని రాజంపేట- నందలూరు, రేణిగుంట- పూడి సెక్షన్‌లో ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడం, మరమ్మతు పనులు కొనసాగుతుండటం వల్ల పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ నెల 25న నడిటే మదురై-బికనేర్, చెన్నయ్ సెంట్రల్- న్యూ జల్పాయిగుడి, సికింద్రాబాద్ -గోరఖ్‌పూర్ రైళ్లను రద్దు చేసినట్టు వెల్లడించింది. హైదరాబాద్-గోరఖ్ పూర్-హెచ్.ఎస్ నాందేడ్ -మన్మాడ్ మధ్య ఈనెల 25, 26, 27, 28 తేదీల్లో ప్రత్యేక రైళ్ల(Special Trains)ను నడపనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.
Also Read: AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం..
రైళ్లు పునరుద్ధరణ..
వర్షాలకు ట్రాక్ దెబ్బతిని నిలిచిపోయిన రైళ్లను దక్షిణ మధ్య రైల్వే(SCR) క్రమంగా పట్టాలెక్కిస్తోంది. ట్రాక్ మరమ్మతు పనులు పూర్తైన అనంతరం ఆయా రూట్లలో రైళ్లను పునరుద్దరిస్తోంది. రేపు నడిచే 6 రైళ్లను యథాతథంగా నడుపుతున్నట్లు రైల్వే అధికారు(Railway Officials)లు తెలిపారు. రేపటి(గురవారం) తిరుపతి- హజరత్ నిజాముద్దీన్ రైలు , చెన్నై సెంట్రల్- ముంబై సీఎస్ఎంటీ , రైళ్లను పునరుద్దరించారు. రేపటి ముంబై సీఎస్ ఎంటీ -చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ , చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్ టీ టీ , ముంబై ఎల్ టీటీ- చెన్నై సెంట్రల్ రైళ్లు యథాతథంగా నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
South Central Railway: పలు రైళ్లు రద్దు.. 6 రైళ్లు పనురుద్ధరణ..