సముద్ర తీరంలో బీచ్ అందాలను చూసి ఎంజాయ్ చేయడంతో పాటు ఎన్నో సాహాసోపేతమైన అండ్వంచర్స్లో కూడా పాల్గొని ఎంచక్కా అందులోని మజాను ఆస్వాదించవచ్చు. అలాంటి అడ్వంచర్స్లో ఒకటి పారాసైలింగ్. సముద్రంపై గాల్లో పారాచూట్ సహాయంతో తేలియాడుతూ విహంగ వీక్షణం చేయడమే పారాసైలింగ్. పారాచూట్ గాల్లో పైకి లేస్తున్న కొద్దీ రెక్కలొచ్చి పైకి ఎగిరినట్టుగా ఉంటుంది పారాసైలింగ్.
సముంద్రం ఒడ్డున పారాసైలింగ్ చేయాలంటే చేతిలో కేవలం డబ్బులు ఉంటే సరిపోదు.. గుండెల నిండా ధైర్యం కావాలని నిరూపించే ఘటన తాజాగా ఒకటి గుజరాత్‌లోని ఉనా సముద్ర తీరంలో చోటుచేసుకుంది. అజిత్ కతడ్, అతడి సరళ తమ కుటుంబంతో కలిసి ఉనా సముద్ర తీరంలో సరాదాగా గడిపేందుకు వచ్చారు. అక్కడే ఉన్న పవర్ బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్లి పారాసైలింగ్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే పవర్ బోట్లోంచి పారాసైలింగ్ చేస్తూ గాల్లోకి లేచారు. పారాచూట్‌కి వేళ్లాడుతున్న తాడును కింద పవర్ బోట్‌కి కట్టారు.
పారాచూట్పైకి వెళ్తున్న కొద్ది ఆకాశంలో తేలిపోతున్న ఫీలింగ్ కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కిందనే ఉన్న అజిత్ సోదరుడు రాకేష్ ఆ దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధిస్తున్నాడు. ఇంతలోనే ఊహించని పరిణామం. పారాచూట్‌కి వేళ్లాడుతున్న తాడు ఫట్‌మని తెగింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే పారాచూట్ వచ్చి సముద్రంలో కూలింది.
@VisitDiu @DiuTourismUT @DiuDistrict @VisitDNHandDD
Parasailing Accident,
Safety measures in India,
and they said very rudely that this is not our responsibility. Such things happens. Their response was absolutely pathetic.#safety #diu #fun #diutourism #accident pic.twitter.com/doN4vRNdO8— Rahul Dharecha (@RahulDharecha) November 14, 2021
Also read : ఆరోగ్యం కోసం ఆవు పేడ తింటున్న డాక్టర్ వీడియో వైరల్.. నెటిజెన్స్ ఏమంటున్నారంటే..
అజిత్, సరళ ఇద్దరూ లైఫ్ జాకెట్స్ ధరించి ఉండటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. తన సోదరుడిని, సోదరుడి భార్యను రక్షించాల్సిందిగా పవర్ బోటులోనే ఉన్న రాకేష్ అక్కడి సిబ్బందిని కోరినప్పటికీ.. అతడి అరుపులను, కేకలను వాళ్లు చెవికి ఎక్కించుకోలేదు. కోస్ట్ గార్డ్స్ వచ్చి రక్షిస్తారని సమాధానం చెప్పారని, ఆ సమయంలో తాను ఏమీ చేయలేని నిస్సహాయుడిగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందని రాకేశ్ ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ విషయంలో పారాసైలింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై అక్కడి అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తూ ఆ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సముద్రంలో కూలిన పారాచూట్ వద్దకు మరో పవర్ బోటులో చేరుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది.. అజిత్, సరళ దంపతులను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. అయినప్పటికీ... జరిగిన ప్రమాదం నుంచి, ఆ షాక్ నుంచి ఆ జంట తేరుకోలేకపోయింది. పారాసైలింగ్ లాంటి అడ్వంచర్స్ నిర్వహించే నిర్వాహకులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.
Also read : Man praying god before stealing hundi: హుండి ఎత్తుకెళ్లడానికొచ్చి ఏం చేశాడో చూడండి.. వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook