BCCI wants to relieve Kohli from the burden of captaincy: టీ20 వరల్డ్ కప్ తర్వాత.. పొట్టి క్రికెట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. టోర్నీ ప్రారంభం కాకముందే ఈ విషయాన్ని కోహ్లీ స్పష్టం (Virat Kohili) చేశాడు. దీనితో ఇటీవల టోర్నీ నుంచి టీమ్ ఇండియా నిష్క్రమించిన నేపథ్యంలో.. టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ (BCCI on Rohit Sharma) నిర్ణయం తీసుకుంది.
టీ20 వరల్డ్‌కప్ ముగిసిన అనతంరం న్యూజిలాండ్‌తో ఇండియా మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇందులో మూడు టీ20లకు, ఓ టెస్ట్ సిరీస్‌కు కోహ్లీని విశ్రాంతిలో ఉంచింది బీసీసీఐ. పని ఒత్తిడి, వరుస మ్యాచ్‌ల కారణంగా అతడు ఇబ్బంది పడుతున్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్‌తో టెస్టుకు (India vs NZ) కోహ్లీతో పాటు.. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. దీనితో అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా ఛతేశ్వర్ పుజారా పేరును ప్రకటించింది బీసీసీఐ. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ లకు టెస్టులకు విశ్రాంతినిచ్చింది. కాగా ఈ సిరీస్‌తో శ్రేయస్ అయ్యర్ భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
Also read: Australia Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త బంతి విసిరిన బౌలర్.. వీడియో వైరల్
అదనపు బాధ్యతల నుంచి విరాట్‌కు విముక్తి?
ఇదిలా ఉండగా.. ఓ కొత్త విషయం తెరపైకి వచ్చింది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీనే స్వయంగా తప్పుకున్నా.. వన్టే, టెస్టు కెప్టెన్‌గా అతడే కొనసాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఓ నివేదికలో ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. వన్డేల్లో కూడా కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కోహ్లీకి అదనపు ఒత్తిడి తగ్గించి బ్యాటింగ్‌పై దృష్టి సారించడం కోసమే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనితో అతడు పాత ఫామ్‌ను పొందొచ్చని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌కు ముందే బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఈ నివేదిక ద్వారా తెలిసింది. ఇక దీనితో పాటు.. వన్డే వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయొచ్చని కూడా సమాచారం.
Also read: Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం
మాజీ కోచ్ రవిశాస్త్రి ఎమన్నాడంటే..
కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించాలని బీసీసీఐ భావిస్తోందని నివేదిక చెబుతుంటే.. టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి మరో కోణం బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ స్వయంగా వన్డే, టెస్టు కెప్టెన్సీని వదులుకునే అవకాశముందన్నాడు. బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాడు. అయితే ఇది ఇప్పట్లో జరగకపోవచ్చని ఇందుకు కొంత సమయం పడుతుందని వివరించాడు.
Also read: Neeraj Chopra: 'నేను మరిన్ని పతకాలు సాధించాలి..తర్వాతే బయోపిక్'..
Also read: Warner Six On Dead Ball: ‘వార్నర్ అలాంటి షాట్ ఆడడం సిగ్గుచేటు’.. గౌతమ్ గంభీర్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
BCCI on Virat Kohli: 'వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించే యోచనలో బీసీసీఐ!'
కోహ్లీ భవిష్యత్‌పై చర్చించే యోచనలో బీసీసీఐ!
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించొచ్చని సమాచారం
బ్యాంటింగ్‌పై దృష్టి పెట్టేలా చూసేందుకే నిర్ణయం!