Shabbir Ali, Dalit CM remarks: దళిత ముఖ్యమంత్రికి నేనెందుకు అడ్డంపడతా

Shabbir Ali comments Dalit CM remarks: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తానెందుకు అడ్డం పడతానని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 11, 2021, 05:53 AM IST
Shabbir Ali, Dalit CM remarks: దళిత ముఖ్యమంత్రికి నేనెందుకు అడ్డంపడతా

Shabbir Ali comments Dalit CM remarks: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనపై లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తానెందుకు అడ్డం పడతానని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. సోమవారం నాడు జరిగిన ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళితుడిని ముఖ్యమంత్రిని చేయనందుకు వస్తున్న విమర్శలపై స్పందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ''ఈ విషయంలో నేను సమాధానం చెప్పడం కాదు కానీ.. స్వయంగా షబ్బీర్ అలీనే వద్దన్నారు'' అని వ్యాఖ్యానించారు. 

సీఎం కేసీఆర్ (CM KCR on Dalit CM) తన పేరును ప్రస్తానిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలపైనే బుధవారం షబ్బీర్ అలీ స్పందిస్తూ.. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటే తాను ఎందుకు వద్దంటానని అన్నారు. అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

Also read : Etela Rajender: హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ దిమ్మతిరిగింది.. అందుకే రెండేసి గంటలు ప్రెస్ మీట్లు

సీఎం కేసీఆర్ నా గన్ మెన్లను తొలగించి నన్ను భయపెట్టాలని చూశారని షబ్బీర్ అలీ ఆరోపించారు. అయితే, కార్యకర్తలే తన బలమని, తానెవరికీ భయపడనని షబ్బీర్ అలీ స్పష్టంచేశారు. మైనారిటీల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం అని చెబుతూ.. 'ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ 4 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే ఎంతో మంది ముస్లింలు నష్టపోయే వారు' అని షబ్బీర్ అలీ (Shabbir Ali) గుర్తుచేశారు.

Also read : Mariyamma lockup death case: మరియమ్మ కేసు విషయంలో హైకోర్టు సీరియస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News